APLatestNews.com top Banner
ఏవండీ, మేము రాసింది కూడా మీరు చదువుతారా? మేము రాయగలమా? - లోకం తీరు
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. మంచి కోరే వారికి దీనిని పంపగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
ఖచ్చితంగా, అసలు నేను రాస్తూ ఉన్న ఉద్దేశ్యం అదే. వీడే రాయగ లేనిది, నేను రాయలేనా అని, మీరూ సొంత మంచి వాక్యాలు మొదలు పెట్టాలి రోషం గా, కోపంగా లేదా ఆనందము గా.

అందుకే పండగ అప్పుడు అన్నా, రెండు లైన్ లు సొంతంగా రాయమని, ఎంతో మందిని ప్రాధేయపడ్డాను. అది ప్రధమ ప్రయత్నము, వేరే వాళ్ళ ఫొటోలు వీడియోలు వాడకుండా. మనము నోరు తెరిస్తే నే, మనసు తెరుచుకుంటుంది. మనసు తెరిస్తే, బుద్ధి బయట పడుతుంది, ఆత్మ భావన పొంగి బయటకు వస్తుంది.

మనము నటిస్తూ , మంచి మాటలు సంవత్సరం రాయలేము. అది చాలా కష్టం, మన భావాలు బయట పడతాయి, మనకు తెలీకుండానే. నేను రాసేటప్పుడు ఆవేశంగా ప్రవాహం గా వస్తుంది, వెబ్సైట్ లో పెట్టేముందు ఇంకోసారి సరిచేస్తా తప్పులు. నా స్నేహితులు కొంతమంది చదివి కూడా తప్పులు సరి చేస్తారు కుదిరితే.

ఒకరు, 5 ఏళ్లుగా తెగ పొగిడారు మొహమాటానికి. ఎప్పుడు అయితే కొన్ని సొంతముగా రాశారో లేదా జవాబు చెప్పారో, వారి డొల్లతనం లేదా మంచి తనము, బయట పడుతుంది. అయితే, ఆ మీ ప్రయత్నం, మంచి గా మారడానికి కూడా ఉపయోగపడుతుంది. ఒకరు వద్దు అనుకుని నటనకు గుడికి వెళ్ళారు, అలా సంవత్సరము చేస్తే, తనకు తెలీకుండానే, మంచి వారు అవుతారు కదా.

దేవుడు ఆ శక్తి అందరికీ ఇచ్చారు. కానీ మనం వేరే పనులు కు, వృధాగా ఖర్చు చేస్తాం. ఉదాహరణకు టీవీ, సినిమా, పోసుకోలు కబుర్లు, మోహం పనులు, . . .

ఇప్పుడు అయినా రెండు సొంత వాక్యాలు, మీ మనసు సుగంధ పరిమళాలు ను, మీ స్నేహితులు తో పంచుకోండి. మన బాధను కూడా అది తగ్గిస్తుంది. అయితే, ఒకటి వారి పొగడ్తలు ఆశించవద్దు. కనీసం భగవంతుని లీల అయినా రాయడానికి ప్రయత్నము చేయండి తీరిక సమయములో.
 

Dt : 29-Oct-2019, Upd Dt : 29-Oct-2019 , Category : General
Views : 38 ( + More Social Media views ) ( id : 206 )
Tags : trying to write good things , share your mind , improve writing skills

గమనిక : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Note : Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 7 yrs
No Ads or Spam, free Content