కష్టాలు లేవు, కోట్ల ఆస్తి ఉంది, అధికారం ఉంది. మాకేమి కాదు, మంచి మాకెందుకు? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2082 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2117 General Articles and views 1,877,312; 104 తత్వాలు (Tatvaalu) and views 225,904.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

రావణుడు, దుర్యోధనుడు కు కూడా జనము, అధికారము, డబ్బు, ఆస్తి ఉంది. వాళ్ళు కూడా పూజలు చేశారు, దానాలు చేశారు, యాగాలు చేసారు. కానీ ఫలితం శూన్యం. ఇది పురాణం. పోనీ దానిని నమ్మక పోయినా, ఈ కాలములో జరిగేవి అయినా చూసి మనము మారాలి కదా.

నిన్నటి కాలంలో అంటే గత 20 ఏళ్ళలో, రామన్న, రాజన్న లను చూసాము కదా. అధికారం, డబ్బు, జన బలము, అద్రుష్టాన్ని కాపాడాయా? లేదే.

మరి నేటి కాలం చూద్దాము, ఒకాయన కోట్లు పెట్టి వెంకన్నకు కిరీటము చేయించారు, కానీ ఆ తర్వాత సంవత్సరము జైలు కు పోయి వచ్చారు.

ప్రజా నాయకులు చంద్రన్న అదృష్టాన్ని, యువతరం నాయకులు జగనన్న అదృష్టాన్ని, ఏ అధికారం డబ్బు జన బలము నిలపగలిగాయా పోకుండా? ఆపగలిగాయా రాకుండా? అవి ఏమీ చేయలేక పోయాయి. ఎందుకంటే, బలమైన కాలము ముందు అవి పని చేయవు. నిస్సహాయముగా విలువ లేని వాటికి మల్లే, చూస్తూ ఉంటాయి అవి.

కాబట్టి కాల చక్రం ఆగదు, మన దగ్గరకు వస్తుంది ఏదో ఒక రోజు, కొంచెము ముందు వెనక అంతే. మన కర్మఫలం ను వడ్డీ తో సహా ఇచ్చి వెళుతుంది. పుణ్యం చేశాను అని మనము అనుకోవడం కాదు, దేవుడు అనుకోవాలి.

ఎందుకంటే, మనకు గతము గుర్తు ఉండదు, మన తప్పులు స్పురణకు రావు. మనకు మంచి కాలమే గుర్తు ఉంటుంది, మోహములో చేసిన గొప్పలు గుర్తు ఉంటాయి.

మోహములో వేసుకునే మన లెక్కలు వేరు, నిష్పక్షపాతముగా వేసుకునే కాలం లెక్కలు వేరు. మనము అనుభవించే గత అదృష్టం ముగియగానే, అన్ని మాయము అవుతాయి, దూరము అవుతాయి, నేటి దరిద్రం వెంటపడుతుంది వేటాడుతుంది.

జాగ్రత్తలు మిత్రమా, తప్పదు. మోసాలతో లేదా మోహం తో లేదా బ్రమలతో, గాలిలో కట్టుకున్న పేక మేడలు, బలమైన కాలానికి ఎదురు నిలబడవు. ఇది శాస్త్రం మాట.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2117 General Articles and views 1,877,312; 104 తత్వాలు (Tatvaalu) and views 225,904
Dt : 28-Oct-2019, Upd Dt : 28-Oct-2019, Category : General
Views : 982 ( + More Social Media views ), Id : 204 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : all good days , millionaire , political strength , people strength , time will give result
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content