APLatestNews.com top Banner
పురాణ రాక్షసులు లో నిజాయితీ, నేటి కలియుగ రాక్షసుల లో అంజనము వేసినా కనిపించునా? - లోకం తీరు
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. మంచి కోరే వారికి దీనిని పంపగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
పాత రోజులు లో రాక్షసులు లో కూడా నిజాయితీ మరియు మంచి రాక్షసత్వము ఉండి, తమ సొంత వారిని ఇబ్బందులు పెట్టకుండా, కేవలం ఇతర జాతులను అంటే దేవతలను, మానవులను బాధ పెట్టారు. ఇతర లోకాలను, ఇబ్బందులు పెట్టారు.

తమ లోకాలను, తమ రాజ్యమును, తమ ప్రజలను బంగారముగా చూసుకునే వారు. అలాగే రాక్షస ప్రజలు కూడా, సొంత రాక్షసులకు కీడు చేసే వారు కారు. ఇతర జాతుల జోలికి మాత్రమే వెళ్ళేవారు, అది కూడా వారి జోలికి వస్తే లేదా రాజ్య విస్తరణ కాంక్షలో.

కానీ ఇప్పుడు టెక్నాలజీ పెరిగి, తెలివి పెరిగి, ఓపిక మరియు మానవత్వం నశించి, తమ తర బేధాలు మరచిన ఈ నాటి కొత్త రాక్షసులు, కేవలం సొంత ఇళ్ళు సొంత మనుషులను మాత్రమే, ముందు ఇబ్బందులు పెడతారు. వీలైతే, తమకు తాము దహించుకుంటారు.

ఆ తర్వాత మాత్రమే, పక్కన ఉన్న ఇళ్ళు లేదా తమ ఆఫీసులకు చెందిన మనుషులు మీద పడి ఇబ్బందులు పెడతారు. అలాగే, తమ ప్రజలకే కీడు చెయాలి అని తలుస్తారు. అలాగే, తమ ఊరు కు, రాష్ట్రము కు, దేశానికి కూడా కీడు చెయ్యటానికి వెనకాడటము లేదు.

కాబట్టి, పురాణ రాక్షసులే నిజాయితీ గలవారు అనుకోవచ్చు కదా, కాబట్టి దేవ దేవుడు వచ్చి శిక్షంచారు, ఇతర జాతుల జోలికి వెళ్ళకుండా. కానీ నేటి మానవ రాక్షసులు కోసం, దేవుడు రానవసరం లేదు. ఎందుకంటే, వీరు తమ గోతులు తామే తీసుకుంటారు కాబట్టి.

భూదేవి, తన పుత్రుడు అయిన నరకాసురిని సత్యభామ లాగా వచ్చి సమ్హరించింది. ఎందుకంటే, తన బిడ్డ మిగతా లోకాలకు కంటక ప్రాయుడు అయ్యాడు. కానీ నేటి రాక్షసులు, తమ పిల్లలు ఎన్ని తప్పులు చేసినా, మోహముతో వారిని కాపాడుతూ, చివరకు తమకు, తమ మనుషులకు తలనొప్పిగా తయారు చేస్తున్నారు.

ఈ దీపావళి దీపాల తో, మనలోని అజ్ఞాన చీకటి ని పోగొట్టి, సాత్వికులుగా మారే ప్రయత్నం చేద్దాం, ముందు తరాలకు మనశ్శాంతి ని ఇచ్చే ప్రయత్నము చేద్దాము.
 

Dt : 26-Oct-2019, Upd Dt : 26-Oct-2019 , Category : General
Views : 65 ( + More Social Media views ) ( id : 201 )
Tags : krishna , purana rakshasa , today rakshasa

గమనిక : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Note : Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 7 yrs
No Ads or Spam, free Content