APLatestNews.com top Banner
అప్పు, మన వెంట వస్తుంది, తర్వాత జన్మ లో రోడ్డు మీద వెతుక్కోవాలి - లోకం తీరు
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. మంచి కోరే వారికి దీనిని పంపగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
మా ఇంటి ఇంటర్నెట్ ఓనరు ఎంత మంచి వారంటే, డబ్బు కట్టక పోయినా అడగడం లేదు. మనది కూడా తప్పు కాబట్టి, సారీ చెప్పి, మొత్తం కట్టాను. అలసత్వం ఎవరికీ నేర్పరాదు, మనకూ ఉండరాదు. మన సొంత, పిల్లల విషయంలో కూడా, అదే చెడు నేర్చుకుంటారు, జీవితములో అవలంబిస్తారు.

నిజమే, నా దగ్గర ఎక్కడ కూ పోదూ. సంవత్సరం కు అయినా పువ్వులో పెట్టి ఇస్తా. కానీ పొరపాటున, రేపు ఉదయం లెగవకపోతే, ఇదే చివరి రోజు అయితే ఖర్మ కాలి? దేవుడు అడగడా, ఛీ, ఇంత ఇస్తే నీకు, అంత చిన్న బాకీ తో వచ్చావా పైకి అంటే? నేనెందుకు సిగ్గుతో తల దించుకోవాలి?

మరి అదేమీ లక్ష కాదు, కోటి కాదు కదా. అంటే, పెద్దది ఎగ్గొట్టమని కాదు, ఎంతైనా అప్పు అప్పే, పక్కవాడి సొమ్మే. ఏదైనా అప్పు ఎగ్గొడితే, తర్వాత బ్రతుకు చివర లేదా మరలా బతుకు దుర్భరమే. అందుకే శక్తికి మించి అప్పు చేయకూడదు, తీర్చే మార్గము కూడా చూసి పెట్టుకోవాలి, మనము లేకపోతే.

ఇక్కడ ఎలా ఉంటుంది అంటే, ఇంటర్నెట్ వాళ్ళ వెబ్సైట్ లో, మెస్సజ్ అవకాశం ఉంటుంది. వారం ముందు, ఆ రోజు, ఆ తర్వాత రోజూ మనకు మెసేజ్ వస్తుంది. బడుద్దాయి బిల్లు పైకము మరువకూ అని.

మనం ఎగకొడితే, క్రెడిట్ రిపోర్ట్ లోకి కూడా వెళుతుంది, అవి పెద్ద సంస్థలు అయితే. జాగ్రత్తలు సుమా.

అప్పు, మన వెంట వస్తుంది, తర్వాత జన్మ లో రోడ్డు మీద, చిప్ప ఇస్తుంది. నానా పాట్లు ఇబ్బందులు కష్టాలు పడి, దానిని తీర్చాలి. ఎందుకొచ్చిన బాధ, ఆ ఖర్మ మనకెందుకు.

ఖర్మ ఫలము వదలదు. అప్పలేని వాడు మనశ్శాంతి గా ఉంటాడు అని చిన్నప్పుడు చదివాము కదా.

ఊరుకో స్వామి, పిల్లలు అప్పుతో చదువు తున్నారు. అమెరికా లో, అంతా అప్పు తోనే మొదలు. నా వ్యాపారం మొత్తం జనం సొమ్మే అంటారా, ఫలితాలు అలాగే ఉంటాయి మరి.
 

Dt : 23-Oct-2019, Upd Dt : 23-Oct-2019 , Category : General
Views : 42 ( + More Social Media views ) ( id : 195 )
Tags : credit follows us , better to clear credit

గమనిక : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Note : Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 7 yrs
No Ads or Spam, free Content