APLatestNews.com top Banner
         
వేమన - సాధన చేయుమురా నరుడా, సాధ్యము కానిది లేదురా - శ్రీ స్వామి తత్వాలు
OurTripVideos - Visiting Places/Local Events Pictures and Videos. We visit, We record, We present, You Enjoy!
           
     
మిగతా తత్వం కూడా మనసుతో చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. మంచి కోరే వారికి దీనిని పంపగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
సాధన చేయుమురా నరుడా, సాధ్యము కానిది లేదురా. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు మహా పురుషులు అవుతారు.

1. ఆనగననగ రాగ మతిసయిల్లుచునుండు,
తినగ తినగ వేము తియ్యనుండు
సాధనమున పనులు సమకూరు ధరలోన,
విశ్వధాభిరామ, వినుర వేమ.

భావం - పాడగా పాడగా రాగం వృద్ధి చెందుతుంది. తినగ తినగ వేప ఆకు కూడా తియ్యగా అనిపిస్తుంది.
అలాగే ధృడ సంకల్పంతో పట్టుదలగా చేపట్టిన పని తప్పకుండా నెరవేరుతుంది.

2. పట్టు పట్టరాదు పట్టి విడువరాదు,
పట్టెనేని బిగియ పట్టవలెను
పట్టి విడుచుటకన్న పరగజచ్చుట మేలు,
విశ్వధాభిరామ వినుర వేమ.

భావం - ఏ (మంచి)పని అయినా మొదలు పెట్టిన దానిని ఆపకుండా తుది వరకూ కొనసాగించి
పట్టు వదలకుండా పూర్తి చెయ్యాలి. అట్లా కానిచో అతడు ఉన్నా లేనట్లే.

3. తరువ దరువ బుట్టు దరువునందనలంబు,
దరువదరువ బుట్టు దధి ఘృతంబు
తలపదలప బుట్టు తలపున తత్త్వంబు ,
విశ్వదాభిరామ వినురవేమ

భావం - ఒరవడి పెట్టగ పెట్టగా కట్టె యందు అగ్ని పుట్టు, పెరుగును చిలకగా చిలకగా నెయ్యి(వెన్న) లభిస్తుంది. అదే విధముగా మననం చేయగ చేయగా మనిషిలో తత్త్వము జనించును.

 
Dt : 03-Oct-2017, Upd Dt : 09-Aug-2019 , Category : Devotional, Views : 1150 ( id : 19 )
Tags :

గమనిక : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Note : Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments

గమనిక - పైన ఉన్న "శ్రీ రామ రక్ష" పిక్చరు ను స్టికర్ గా, ఇంటి గుమ్మం తలుపు మీద, ఫ్రిడ్జ్ మీద, పూజ గది లో, ఇంటిలో కనపడే చోట, వాహనము మీద రక్షణ లేదా గుర్తు(స్మరణ) గా వీలైతే ఉపయోగించుకోవచ్చు.
All best news at one place for NRIs
Multiple source NEWS from 7 yrs
No Ads or Spam, free Content
APLatestNews.com - Sri Swami Tatvaalu శ్రీ స్వామి తత్వాలు