APLatestNews.com top Banner
పల్లెటూళ్ళో నవరాత్రులకు 9 కుటుంబాల తో అమ్మవారి పూజ, కాలేజీ విద్యార్ది - ఏమిటి, ఎలా? - లోకం తీరు
         
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. మంచి కోరే వారికి దీనిని పంపగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం / వీడియో మరువద్దు.

కంప్యుటర్స్ మాస్టర్స్ చేసే విద్యార్థులు గుడికి చందా , పటముతో ఊరేగింపా? విద్యార్థి , ఊళ్ళో నవరాత్రులకు 9 మంది దంపతులు తో పూజ చేశాడా? మరి ఊరి పూజారులు ఒప్పకున్నారా? కాలేజీ విద్యార్ది ని పంతులు గారూ(కాకపోయినా) అని అంటారా ఊరు మొత్తం? పల్లెటూళ్ళో పంతాలు పట్టింపులు తెలుసు కదా. మరి ఎలా ఒప్పించారు మెప్పించారు? కాలేజీ విద్యార్థులు మోహం లో పడకుండా, ఊరి జనం తో తెలివిగా, లౌక్యం గా ఉండటము ఎలా? చదవండి మరి . . .

దసరా ఉత్సవాలు ముగిశాయి, అందరము ఆ దుర్గమ్మ తల్లిని తలచుకున్నాము పూజించాము మనస్పూర్తిగా. రాము, తన అనుభవాలు చెప్తున్నాడు శ్రీధర్ తో - కాలేజీ విద్యార్ధులు అంటే, అందరికీ చెడు భావన ఉంటుంది, ఆకతాయిలు , సినిమాలు షికార్లు తిరుగుతూ ఉంటారు. కానీ భయం, భక్తి, భాద్యత ఉండదు అని. ఈ కధ విను, 20 ఏళ్ళ ముందుది.

అప్పుడు గుంటూరు దగ్గర పల్లెటూళ్ళో ఉండే వాళ్ళము. ఒక ముగ్గురము దాకా, అద్దె ఖర్చులు తక్కువనో, ప్రశాంతము గా ఉంటుంది అనో ఊళ్ళో ఉండే వాళ్ళము. ఇంకొంతమంది బైపాస్ రోడ్ మీద ఉండే వారు, మిగతా వారు గుంటూరు నుంచి వచ్చే వారు. మనకు మొదటి నుంచి పూజలు, పునస్కారాలు అలవాటు.

అక్కడ అద్దెకు ఉన్న ఓనర్ గారు వైష్ణవులు, అంటే పొద్దున్నే లెగవడం, మడితో పూజలు పునస్కారాలు చెయ్యడం, గుడిలో పౌరహిత్యం అన్ని చేస్తారు. మనకు కూడా, కొన్ని మంత్రాలు వచ్చు, కాని సూక్తాలు, మంత్రపుష్పం కూడా సొంతముగా నేర్చుకోవాలి అని వారికి చెందిన ఆంజనేయ స్వామి చిన్న గుడి, వూరి చివర ఒక దిక్కున ఉంటుంది.

సాయంత్రం కాలేజీ నుంచి ఇంటికి వచ్చాక స్నానం చేసి, వెళ్ళి గుడి దగ్గర బయట అరుగు మీద కూర్చోని, స్వామికి పూజ చేస్తున్నట్లు గా దానిని పెద్ద గొంతుతో వల్లె వేసే వాడిని. గుడి మూసి ఉంటుంది, జనం ఎవరు ఉండరు, ఊరి చివర కాబట్టి.

ఆ దోవన ఇంటికి వచ్చే రైతులు, జనాలు రోజూ వింత గా చూసే వారు. ఏమిటీ టీవీ చూడకుండా, చెత్త కబుర్లు వేసుకోకుండా, సెంటర్ లో పడిగాపులు కాయకుండా, పిచ్చివాడిలా ఇలా చదువుతున్నాడు అని మొదట్లో. తర్వాత, పట్టించుకోవడం మానేసారు, ఇంతేలే వీడికి పిచ్చి అని.

అలా మొదలు అయ్యింది పెద్దగా మంత్ర పఠన. నాకూ తెలీదు, ఎందుకు చెస్తున్నానో, తర్వాత ఏమి జరగాలో అని. పల్లెటూళ్ళో ప్రతిదానికి పెడ అర్దాలు తీయడం మాములే కదా, పట్టించుకోకుండా, మన సాధన మనము చేసుకుంటున్నాము.

కొంత మంది మెచ్చుకున్నారు కూడా, స్వరము ఉచ్చారణ బాగుంది, పూజారి కన్నా నీ మాటలే అర్ధము అవుతున్నాయి అని. అలా సంవత్సరము పాటు జరిగింది. చుట్టుపక్కల వారు అందరు తెలిసారు, సహకరిస్తున్నారు. ఒక స్నేహితుడు వంకాయలు, టమాటాలు కూడా తెచ్చి ఇచ్చే వాడు. ఇప్పుడూ తను ఇంకా అందుబాటులోనే ఉన్నాడు.

కొంత కాలం తర్వాత, ఇటు చీకటి పడితే ఒక్కడినే అవుతున్నాను. కొంచెము భయము ఉండేది. అదీ గాక ఇల్లు మారి, హనుమాన్ గుడి దూరము అవుతుంది. ఊరి మొదట్లో, వినాయకుని గుడి ఉంది. బస్సులు, జనము అందరు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు, తప్పనిసరిగా ఆగి దండము పెట్టుకుంటారు. ఈ గుడి దగ్గరగా ఉంది అని అక్కడ, అదే విధముగా చదవడము మొదలు పెట్టాను. అది మందిరము కాబట్టి ఎక్కువ నియమాలు ఉండవు. లోనకి మనము కూడా పోవచ్చు తాకవచ్చు.

ఆ గూడేం వాళ్ళే, పెద్ద దంపతులు ఇద్దరు, దీపము పెట్టి నైవేద్యము పెట్టేవాళ్ళు తెలిసిన 2 పద్యాలు చదువుకుంటూ. ఇప్పుడు నేను వచ్చేసారికి, వాళ్ళకి ఎంతో బలం వచ్చినట్లు గా ఉంది. వాళ్ళ అండ కూడా తోడు అయ్యింది. అలా కొన్ని నెలలు సాగింది, ఊరంతా గమనిస్తున్నారు. కంప్యూటర్ కాలేజీ అబ్బాయి వేదం మంత్రాలు ఏమిటి, అని వింత గా ఉంది అందరకు.

అప్పుడు గుడి వారు, ఏదైనా సహాయము మీ కాలేజీ నుంచి చేయవచ్చు కదా అంటే, మా తోటి వాళ్ళను అడిగాను, తలా కొంత వేసుకొని, ఒక దేవుని పటము కొనుక్కొని, మా గది నుంచి ఒక 15 మందిమి ఊరేగింపుగా వెళ్ళి,, పటము మరియు మిగిలిన డబ్బులు ఇచ్చాము వారికి. గోడకు రాతి ఫలకము కూడా వేయించారు కాలేజీ పేరుతో, ఇప్పటికీ వుంది, బొమ్మలో చూడవచ్చు.

తర్వాత ఇంకో 15 రోజుల్లో దసరా నవరాత్రులు. అన్ని గుడులతో పాటు గా, వారు చేద్దాము అని మాట్లాడుకుంటున్నారు ఒక రోజు సాయంత్రము. మన జనమే 9 రోజులు కూర్చుంటారు, పూజారిని ఎవరిని మాట్లాడదాము అని అనుకుటున్నారు. మన పెద్ద పూజారి ఉన్నారు కదా, ఆయనను పిలవండి అని చెప్పాను. వారంతా, మాకు నువ్వు ఉన్నావు గదా, బయట వారెందుకు అన్నారు, ఇంత కన్న స్పష్టము గా చెప్ప గలిగేది ఎవరు అన్నారు.

అమ్మో, చాటుగా ఒక్కడినే అనుకోవడము వేరు, ఊరి జనము ముందు మైకు లో ఇలా చెయ్యడము వేరు. గొంతు వస్తుందో రాదో భయముతో. అలాగే, దక్షిణ నేను తీసుకోను, పెద్ద వాళ్ళు నాకు దండము పెడతారు ఎలా అన్నాను. అంతే గాక, ఊళ్ళో ఉన్న పూజారులు అందరూ, నేను ద్రోహము చేస్తున్నానను అని నా మీద కొప్పడతారు, అని చెప్పాను.

అది నాకు ఇష్టము లేదు, వద్దు అన్నాను. నేను బ్రహ్మనుడుని కాను కదా అన్నాను, పుట్టుకతో కాదు పనులని బట్టి బ్రహ్మణుడు అన్నారు వాళ్ళు., వారు సర్ది చెప్పే ప్రయత్నము చేసారు. లేదు మనము భారీగా చెయ్యాలి, బస్సుల వాళ్ళు కూడా అండగా ఉంటారు, నువ్వే చెయ్యాలి అన్నారు. సరే ఇంకా టైం ఉంది కదా, నేను ఊళ్ళో పూజారులతో మాట్లాడతాను అన్నాను. నీ ఇష్టము అన్నారు.

ఒక రోజు సాయంత్రము నాకు తెలిసిన, ఆ ఊరు పెద్ద పూజారి దగ్గరకు వెళ్ళాను. ఆయనకు అంతా వివరించి, ఏమి చెయ్యమంటారు అన్నాను. ఆయన, ఇందులో తప్పు ఏమి ఉంది, నేను నువ్వు మంత్రాలు చదవడం గురించి విన్నాను. నువ్వేమి పౌరోహిత్యము లేదా స్వార్ధం కోసం చేయడము లేదు కదా. పది మందికి ఉపయోగపడేదేను. తప్పు లేదు, చెయ్యి, మిగతా వాళ్ళతో నేను చెపుతాను ఎమన్నా అంటే అన్నారు. గురువు గారు, మీ మంచి మనసుకు ధన్యవాదాలు.

అంత వరకు, పర్లేదు, కానీ పూజ అయ్యాక వాళ్ళు నమస్కారాలు చేస్తారు డబ్బులు ఇస్తారు, అవి నేను తీసుకో కూడదు తప్పు కదా అన్నాను. ఆయన, అక్కడ నువ్వు అన్నది మరచిపో, అక్కడ ఉన్నది పూజారి అనుకో అంతే, డబ్బులు హుండీలో వేయి అన్నారు. వినటానికి బాగానే ఉంది, కాని మీరు ఉంటే బాగుంటుంది, నమస్కారాలు డబ్బులు మీరు తీసుకుందురు, దయచేసి మీరు కూడా రాండి అన్నాను. ఆయన ఒప్పుకున్నారు.

గుడి వాళ్ళతో చెప్పాను, ఇంక వాళ్ళు పనులు మొదలు పెట్టారు, రంగులు, లైట్లు, మైకు, అలంకారాలు, పెద్ద అమ్మవారి పటము, పూలు, దండలు, 9 మంది దంపతులు సిద్దము అయ్యారు 9 రోజుల పూజకి. ఊరు మొత్తము పాకి పోయింది వార్త, కాలేజి అబ్బాయి చేస్తున్నాడు అంట పూజ అని. అదొక వింత లాగా ఉంది అందరికీ, ఇప్పటిదాకా విన్నాము, ఎలా చేస్తాడో చూద్దాము అని అనుకున్నారు.

ఇంకా నాలో దడ మొదలు అయ్యైంది, ఒక పక్క మాస్టర్స్ చదువు, ఈ తెచ్చుకున్న బాధ్యత. మంత్రాలు/ మంత్రపుష్పం/ సూక్తాలు కంఠస్తము వచ్చాయి ఎప్పుడో. మరలా నెమరు వేసుకున్నా. ఇంక నీసుకు దూరముగా ఉండాలి అనుకున్న, శాఖాహారము మాత్రమే, అప్పటినుంచి ఇప్పటివరకు, చేపలు మాంసము లేవు. ఎటూ నేల నిద్రే. పూర్తి నిష్టతో ఉండటము మొదలు పెట్టాను. అలా నవరాత్రి మొదటి రోజు వచ్చింది. సాయంత్రము 6 నుంచి జనము రావడము మొదలు పెట్టారు.

నేను పిలిచిన పూజారి గారు వచ్చారు సహాయకులుగా తోడుకోసం, దంపతులు వచ్చారు. చుట్టూ 100 మంది పైగా జనం, ఆ రోడ్డున వెళ్ళే వాళ్ళు అందరూ ఆగి చూడటము. చిన్న గా గణపతి ప్రార్ధన తో మొదలు పెట్టి, సూక్తాలు వచ్చేటప్పటికి మధ్యలో ఆగినప్పుడు ఆయన అందుకునే వారు, ఇలా ఇద్దరము కలసి చదివాము.

ఎందుకు చేస్తున్నామో అర్ధాలు తో సహా, మంచిగా చేసాము. మైకులో చుట్టూ పెద్ద గా వినపడుతుంది. నాకు తెలిసిన వాళ్ళు వచ్చారు, ధైర్యము చెప్పారు.

పూజ చివర దక్షిణ మరియు దండాలు ఆయనకు. ఇక అప్పటినుండి అందరు, పంతులు గారు అని పిలుస్తున్నారు. అలా తొమ్మిది రోజులు అంగరంగ వైభవుముగా పూజ చేసే అవకాసము వచ్చింది. ఆ రోజులలో మనము ఫోటోలు తీసుకునే యోగము లేదు. దూరము నుంచి పిలవాలి, ఎగస్టా ఖర్చు అనుకున్నాము.

ఆ తర్వాత సంవత్సరము అందరమూ, వెళ్ళిపోయాము. తర్వాత ఐదు ఏళ్ళకు మరల వచ్చి పలకరించాను అందరిని, వాళ్ళు అంతా, ఓ పంతులు గారు వచ్చారు అని అందరితో చెప్పారు.

ఆలా ఆ తల్లి సేవ చేసుకునే భాగ్యం కలిగింది, అమ్మ దయతో కలిగించింది, ఆ వూళ్ళో పంతులుగా మిగిల్చింది, అని పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నాడు.

ఈ క్రింది బొమ్మలలో ఉన్న గుడులు ఈ రోజువి(సెప్టెంబర్ 2019), అప్పుడు అంత కూడా లేవు. మొదటి రెండు, ఊరి చివర హనుమాన్ గుడి. తర్వాత వి ఊరి మొదలు వినాయకుని గుడి.
  పల్లెటూళ్ళో నవరాత్రులకు 9 కుటుంబాల తో అమ్మవారి పూజ, కాలేజీ విద్యార్ది - ఏమిటి, ఎలా? - Pic 2

పల్లెటూళ్ళో నవరాత్రులకు 9 కుటుంబాల తో అమ్మవారి పూజ, కాలేజీ విద్యార్ది - ఏమిటి, ఎలా? - Pic 3

పల్లెటూళ్ళో నవరాత్రులకు 9 కుటుంబాల తో అమ్మవారి పూజ, కాలేజీ విద్యార్ది - ఏమిటి, ఎలా? - Pic 4

పల్లెటూళ్ళో నవరాత్రులకు 9 కుటుంబాల తో అమ్మవారి పూజ, కాలేజీ విద్యార్ది - ఏమిటి, ఎలా? - Pic 5

పల్లెటూళ్ళో నవరాత్రులకు 9 కుటుంబాల తో అమ్మవారి పూజ, కాలేజీ విద్యార్ది - ఏమిటి, ఎలా? - Pic 6


Dt : 09-Oct-2019, Upd Dt : 09-Oct-2019 , Category : General, Views : 120 ( id : 184 )
Tags : Navaratri , devi puja , masters computer student

గమనిక : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Note : Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
All best news at one place for NRIs
Multiple source NEWS from 7 yrs
No Ads or Spam, free Content

rightclk =