APLatestNews.com top Banner
మనకు పళ్ళు రాలితేనే కదా, అసలు బాధ తెలిసేది, ముందు వాళ్ళ వ్యధ ఎక్కేది - లోకం తీరు
         
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. మంచి కోరే వారికి దీనిని పంపగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
శ్యాం, నీరజ్ మరియు మిగతా స్నేహితుల తో పిచ్చా పాటీ మాట్లాడుతూ, ఊరక అడుగుతున్నాను, ఆలోచన చెయ్యండి.

కోట్లు, బలం, బలగం, కుటుంబం, పిల్లలు, అధికారం ఉండి అన్న గారిని, కోడెల గారినీ, కాఫీడే గారిని ఎందుకు కాపాడలేక పోయినాయి? ఏ పిల్లలు కాపాడారు? వెళతా ఏమి తీసుకెళ్లారు? కనీసం 100 నోటు? నటసమ్రాట్ అద్రుష్టం ఎంతమందికి దక్కుతుంది?

ఇంక మన చుట్టూ, ఇళ్ళు చుట్టూ ఇలాంటివి, బయటకు రానివి ఎన్నో. మరి ఒంటరి వారికి, అన్ని ఉన్న వారికి, తేడా?

పరుగులు తీసి తీసి అలసి పోయి, మనసు ను జయించలేక ఓడిపోయి, అటు ఇటు తిట్లు ఛీత్కారాలు, చివరకు ఎటూ ఒంటరే. ఈ లోపల భరించలేక, ముందే పైకి టికెట్లు.

ముందే, ఒంటరి వారు సీనియర్లు, చిన్న గా నడుస్తూ, చివరకు వారూ అంతే. కనీసం తల్లి దండ్రులకు, సమాజానికి ఉపయోగము లేని సంతానము వలన ప్రయోజనము ఏమి? 90 శాతం ముందే చెప్పేస్తున్నారు, మా పిల్లలు చూడరు అని, మరి అంత నమ్మకం వారి పెంపకం మీద.

మరి ఈమాత్రం దానికి, పరుగులు, మోసాలు, నటనలు, కోపాలు, తాపాలు, తగవులు, అహంకారం, మోహం, బంధం, అబ్బోఅ ఏమిటో ఈ జగన్నాటకం.

అబ్బా, లేదు లేదు నేనూ చూడాలి, అందరి లాగా నేనూ పడాలీ, అని మన ప్రేమ కుర్రాళ్ళ ఉరుకులు పరుగులు. పెళ్ళాం లేదా మొగుడు తంతే తోడుగా ఉంటాము రా అని పేరెంట్స్ అంటే, వద్దు మేము ముందు ఒక్కళ్ళ మే తన్నించుకుంటాం గుట్టు గా, చివరలో గృహ హింస కింద తోడుగా వద్దు రు జైలు కు అని, నేటి తెలివిగల యువతరం, తల్లి దండ్రులకు కొన్ని అయినా పాట్లు తప్పిద్దాము అని.

ఊ కానీయండి, మనకు పళ్ళు రాలితేనే కదా, అసలు బాధ తెలిసేది, ముందు వాళ్ళ వ్యధ ఎక్కేది, కొత్త వారికి మరో కధ దొరికేది.

అంతేరా బాబూ, జగమే మాయ బ్రతుకే మాయ అని పెద్దాళ్ళు ఎప్పుడో చెప్పారు, అని అందరూ నవ్వుకున్నారు.
 
Dt : 27-Sep-2019, Upd Dt : 27-Sep-2019 , Category : General, Views : 65 ( id : 175 )
Tags : life issues , family person , single person , youth love

గమనిక : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Note : Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
All best news at one place for NRIs
Multiple source NEWS from 7 yrs
No Ads or Spam, free Content

rightclk =