APLatestNews.com top Banner
స్తోమత పరంగా వీలుగా ఉన్నా కూడా, నేను పేరెంట్స్ తో ఉండను, వారిని నాతో పెట్టుకోను - లోకం తీరు
         
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. మంచి కోరే వారికి దీనిని పంపగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
రాజు, రాముతో ఇలా చెప్తున్నాడు, పేరెంట్స్ ని బాగా చూసుకోవడం గురించి. ఈ వారం ఒక 60 ఏళ్ల ఆయన తో మాట్లాడాను, ఆయన స్పష్టం గా చెప్పారు - నాకు డబ్బు ముఖ్యం, సౌకర్యాలు, పేరు ప్రఖ్యాతులు, తన కుటుంబము మాత్రమే ముఖ్యం అని.

స్తోమత పరంగా వీలుగా ఉన్నా కూడా, నేను పేరెంట్స్ తో ఉండను, వారిని నాతో పెట్టుకోను, మా అమ్మ పాలు తాగినా తాగికపోయినా మార్పు లేదు అని ఓపెన్ గా. ఆయన నిజాయితీ నాకు నచ్చింది, వినటానికి కష్టం గా ఉన్నా. ఆయన లేదా అలాంటి మాట లోన అనుకుని బయటకు నటించే, వారి బిడ్డలు కు, ఎంత సంస్కారం ఉంటుందో, వీరి భవిష్యత్తు ఎలా ఉంటుందో ఊహించవచ్చు.

చాలా మంది నటిస్తూ అబద్ధాలు చెపుతారు ఏవేవే - ఊరు ఇళ్ళు వదలరు అని - మా వాళ్ళు నా(మా ఆవిడ) మీద నమ్మకం లేక రారు, సరిగ్గా చూడము, అనవసరపు ఖర్చు, అని మాత్రం చెప్పరు. వారికి 100 శాతం పాపం అయితే, ఈయనకు 95 మాత్రమే ఉంటుంది ఏమో పాపం. పాపం, వీరిద్దరూ ను ఆ దేవుడే కాపాడాలి భవిష్యత్తులో, వారి సొంత బిడ్డలు నుంచి.

ఆయనను తప్పు పడుతూ ఉండటానికి మనం నీతి మంతులమా? ఆయన దమ్ము, ధైర్యంగా ఓపెన్ గా చెప్పారు, చెడు అయినా.

ఇప్పుడు నేను 60 నెలలు, రోజూ నచ్చ చెప్పినా లేక సూక్తులు చెప్పినా, మారతారా ఆయన? 60 ఏళ్ళుగా వంటబట్టిన వాసనలు పాపాలు తేలికగా పోవు, 60 జన్మలు లో ఫలితాలు అనుభవించినదాకా. వారి పూజలు, దానాలు వ్యర్థం కదా.

మన చుట్టూ లేదా మన ఇంట్లో నే, ఆ మాటలు బయటకు అనకుండా నే, అచ్చం అలాగే చేస్తూ, నటించే ఆస్కార్ అవార్డు గ్రహీత లు, 40 ఏళ్ల నుంచే ఉన్నారు కదా.

తప్పు ఆయన కూడా (చెడ్డ) గురువు గారే. కాకపోతే, ఎలా ఉండకూడదో పాటించి చూపిస్తున్నారు, మనలాంటి మంచి వారికి. ఇలాంటివారు ప్రతి ఇంట్లో ఉన్నారు.

ఉదాహరణలు ఎన్నో, ఇవి చూడండి -

1. మన ఊళ్ళో బిడ్డలు సొంత మిద్దె లో ఉంటే, పేరెంట్స్ పక్క ఊళ్ళో, బజార్ లో అద్దెకు లేదా సొంత పాత పెంకులు, పూరింట్లో, డాబా గది లో ఒంటరిగా ఉంటారు.

2. కొడుకు/కూతురు మద్రాస్ లో ఉద్యోగం, కోట్ల లేదా లక్షల భార్య/ భర్త. పేరెంట్స్ కోసం చుట్టాలు లేదా తమ వాళ్ళ మొఖాన డబ్బు వేసి, ఊళ్ళో ఇంట్లో వదిలేయడం.

3. మంచి స్ధితిలో ఉండి, విదేశాల్లో 5 ఏళ్లుగా ఉద్యోగం లేదా సొంత ఇల్లు లేదా బిడ్డలు చదువు లు. కానీ, మన ఊళ్ళో రోగాలతో పల్లెల్లో/ పట్టణాలలో చిన్న ఇల్లు/ అపార్ట్మెంట్స్ లో/ ఆశ్రమాలలో పేరెంట్స్.

వీరంతా ఏమి నోటితో బయటకు చెప్పకుండా నే, అదే చెపుతున్నారు మనసుతో చేస్తున్నారు చేష్టలతో. మా అమ్మ నాకు పాలు ఇవ్వలేదు, ముద్దాడ లేదు. మా బాగోగు చూడలేదు. నాన్న కూడా. మరి మాకేమి అవసరం వారి సంగతి అని?

అలాంటి తప్పుడు మనుషులు కు, మా సౌకర్యాలు వైద్యం రక్షణ ఎందుకు ఇవ్వాలి? సంవత్సరం కు ఒకసారి పల్లె వచ్చి, ఊడిగం చేయిచ్చుకుని, ఊళ్ళు తిరిగి, గొప్పలు చెప్పకొస్తే చాలదా? అంతేకదా?

వాళ్ళ తల్లి దండ్రులు బాధ నేను చూసా. కడుపు రగిలి పోతుంది. కానీ, ఏమీ చేయలేము. కనీసం అయ్యో అని బాధ కూడా పడకపోతే, మనం మనుషులం కాదు. మనం, ఆ స్ధితిలో ఆ వయసు లో ఉంటే నే, వాళ్ళ బాధ తెలుస్తుంది.

వాళ్ళు రెండు వైపులా తెలుసు కాబట్టే బాధపడుతున్నాను. పెద్దలు ఎంత తప్పు చేసినా, తను ఇలా చేయకూడదు. గతములో తను ఇలా చేసినా, కనీసం అరవై లో నయినా అర్ధము చేసుకొని పశ్చాత్తాప పడాలి కదా.

ఎవరమూ తక్కువ కాదు, అందరం మహా గురువు ల మే. మన కన్నా రావణుడు, దుర్యోధనుడు నయం. నటించరు, 2 నాల్కలు లేవు. అని ఇద్దరూ నిట్టూర్పు విడిచారు బాధతో.
 
Dt : 27-Sep-2019, Upd Dt : 27-Sep-2019 , Category : General, Views : 54 ( id : 173 )
Tags : old parents , care of elders

గమనిక : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Note : Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
All best news at one place for NRIs
Multiple source NEWS from 7 yrs
No Ads or Spam, free Content

rightclk =