APLatestNews.com top Banner
ఉపాధ్యాయ దినోత్సవం - మా డిగ్రీ, పీజీ కాలేజీ గురువుల ప్రొత్సాహం సాఫ్ట్వేర్ బోధనలో - లోకం తీరు
         
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. మంచి కోరే వారికి దీనిని పంపగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం / వీడియో మరువద్దు.

ప్రతీ ఏటా సెప్టెంబర్ 5 న ఉపాధ్యాయ దినోత్సవం ( టీచర్స్ డే ) జరుపుకుంటాము. ఎందుకో తెలుసా, ఆ రోజు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి. అయితే ఆయన పుట్టిన రోజునే టీచర్స్ డే గా జరుపుతారు. ఆయన మొదట ఉపాధ్యాయుడు, విద్యావేత్త, ఆ తర్వాత ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి.

ఆ రోజున పిల్లలు, తమ ఉపాధ్యాయులపై ఉన్న ప్రేమను, అభిమానాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు. పెద్దలు కూడా, తమ పాత గురువులను స్మరించుకుంటారు. పాఠశాల ఉపాధ్యాయులు, కళాశాల ప్రొఫెసర్లు తో పాటూ, ఇతర రంగాలలో శిక్షకులు కూడా ఉపాధ్యాయులే.

గురు పౌర్ణమి తో పోల్చవద్దు, అది ఆధ్యాత్మిక గురువుల గురించి. ఇది చదువు లేదా శిక్షణ ఇచ్చి, ప్రోత్సహించి, భుజం తట్టి, బ్రతుకు దోవ చూపిన, భౌతిక గురువుల గురించి.

వెంకట్, క్రిష్ణతో తన కంప్యూటర్ చదువు, అల్గారిధంలు ప్రోగ్రాం నేర్చుకోవడం, తనను వెన్నుతట్టి, ముందుకు నడిపిన గురువుల గురించి చెపుతున్నాడు క్రుతజ్ఞతతో. చిన్నప్పటి నుంచి చాల మంది గురువులు ఉన్నారు, వారికి కూడా వందనములు.

అప్పుడే బాపట్లలో బీయస్సీ కంప్యుటర్ సైన్స్ పెట్టి రెండవ సంవత్సరం మొదలు అవుతుంది. అందరూ దానికి భవిష్యత్తు బాగుంటుంది అని చెపితే, కెమిస్ట్రీ(రసాయన శాస్త్రం) నుంచి తప్పించుకోవాలి అని, దాని వైపు మొగ్గు చూపాను. ఆర్ట్స్ కాలేజీ లో డిగ్రీ అయినా కూడా, పాఠాలు ఇక్కడ, లాబ్ వర్క్ ఇంజనీరింగ్ కాలేజ్ లో పెట్టారు. అంటే, మేము వారానికి 2 లేదా 3 సార్లు బస్సులో అక్కడకు వెళ్ళాలి.

కంప్యూటర్ లెక్చరర్ గా ఇంజినీరింగ్ కాలేజ్ మాథ్స్ డిపార్ట్మెంట్ హెడ్ ను వేసారు. ఆయన బాగానే సాఫ్ట్వేర్ ప్రోగ్రాం గురించి చెప్పేవారు, బుర్రకి అర్ధము అయినట్లు ఉంటుంది, కాని తిప్పి మనలను రాయమంటే లాజిక్ వచ్చేది కాదు. ఆయనను అడగాలంటే భయము, సీరియస్ గా ఉంటారు. లాబ్ లో ఆయన ఇచ్చిన ప్రోగ్రాంస్ చేసి వారానికి చూపించాలి. చేయలేక ఇబ్బంది పడేవాళ్ళము. ఎవరికీ అంత గా తెలీదు బయట అడగాలి అంటే.

అప్పుడే దేవుడు వాళ్ళ తమ్ముడిని, మాకు లాబ్ లో సహాయము చేయమని పంపారు. ఆయన, ఎలెక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్ లెక్చరర్. అప్పుడప్పుడు వచ్చి వెళ్ళేవారు, ఖాళీ సమయాన్ని బట్టి. చాలా మెతక, మంచివారు, సహాయం చేస్తారు, ప్రోత్సహిస్తారు. చిన్నగా కొన్ని ఉదాహరణలు తీసుకు వెళ్ళి, సలహాలు అడిగేవాడిని. ఆయన కొన్ని చెప్పి, క్లూ ఇచ్చేవారు. పాస్కల్ లాంగ్వేజ్ లో రాయాలి.

చిన్నగా పరిచయము పెరిగి, నమ్మకము కలిగింది. ఆయనే కొన్ని ఉదాహరణలు ఇచ్చి చెయ్యి అని దోవ చెప్పేవారు, సలహా కావాలి అంటే, నా ఎలెక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్ లాబ్ దగ్గరికి రా, ఎప్పుడైనా కూడా పర్లేదు అనేవారు. చాలా సార్లు లాబ్ మధ్యలో వెళ్ళి అడిగే వాడిని, ఓపికగా అన్ని చెప్పేవారు. కొన్ని సార్లు కోప్పడ్డారు కూడా, కానీ నేను వదల్లేదు. కొన్ని వారాలకి, అసలు లెక్చరర్ ఇచ్చే అన్ని ప్రొగ్రాం లు, పోటా పోటీ గా రాసే దాకా వచ్చాము.

ఆయన చెప్పే విధానం కూడా బాగుంటుంది, నేరుగా జవాబు చెప్పరు, ప్రశ్నలతో మన చేత చెప్పిస్తారు. ఎదురుగా కూర్చోబెట్టి ప్రయత్నించు రాయి, తప్పు అయినా పర్లేదు అనేవారు. ఆర్ట్స్ కాలేజీ విధ్యార్ధికి, ఇంజినీరింగ్ కాలేజ్ లెక్చరర్ సోదరుడు అండగా ఉండి ముందుకు నెట్టడం అంటే, అదే దేవుని సంకల్పం. కాబట్టి, మనిషిలోనే దేవుడు ఉన్నారు అంటే తప్పు కాదు గదా.

ఒక ముగ్గురము పోటీ పడేవాళ్ళము, వారములో ఎవరు ముందు చేస్తారు అనే దగ్గర. కొన్ని సార్లు మనది కూడా పైచేయి ఆయ్యేది. అలా అల్గారిధం రాయడం బాగా వంట బట్టింది. ఆయన, ఇంజినీరింగ్ కాలేజ్ లైబ్రరీ లో కూడా చెప్పారు, ఈ అబ్బాయి వస్తే బుక్స్ కూడా, నా పేరు మీద ఇవ్వండి అని.

చాలా సార్లు తీసుకున్నా బుక్స్, ఆర్ట్స్ కాలేజ్ లో అన్ని పుస్తకాలు ఉండవు. అలా దేవుడి పంపినట్లు గా ఆయన భుజం తట్టి, ముందుకు నెట్టారు. వాళ్ళ అన్న గారు అసలు లెక్చరర్ అయినా, దగ్గరకు మాత్రం అసలు పోను.

అదే ధైర్యముతో, తర్వాత సంవత్సరాలలో వచ్చే కోబాల్, సీ లాంగ్వేజ్ కూడా ముందే నేర్చుకొని సిద్ధముగా ఉండే వాడిని. ఆర్ట్స్ కాలేజ్ లో, కాలేజీ ఉద్యోగుల సాలరీ ప్రోగ్రాం రాసి ఇస్తాను అని చెప్పి, ఆఫీస్ లో వాళ్ళని ఒప్పించి, డీబేస్ లో చేసాము. అక్కడ ఉన్న క్లర్క్ చాల అండగా ఉండి సహాయము చేసాడు. రాత్రి 7 దాకా అక్కడే ఉండేవాళ్ళము. తర్వాత అక్కడే లాబ్ పెట్టి, అతనినే హెల్పర్ గా వేసారు. ఆ తర్వాత అతనిని కూడా చాలా సార్లు కలిసాను, మన ఇంటికి కూడా వచ్చారు.

చదువు ఆయ్యక కూడా సహాయము చేసిన లెక్చరర్(తమ్ముడు) దగ్గరకు వెళ్ళి గతం గుర్తు చేసి వచ్చాను. కాని 25 ఏళ్ళలో ఎంతో మంది నా లాగా వచ్చి వెళ్ళి ఉంటారు. గుర్తు పట్టడం కష్టము. అంటే నేను ఆయనకు శిష్యుడు కాని శిష్యుడు ని.

ఇప్పుడు ఆయన అదే కాలేజీ కి, ప్రిన్సిపాల్ అయ్యారు కూడా. కానీ అదే మర్యాద, అదే నవ్వు, అవే జోకులు, అదే మంచితనం, ఏమీ మార్పు లేదు. ఆ తర్వాత లాజిక్ ప్రోగ్రాం కి ఎప్పుడూ ఇబ్బంది పడలేదు, చూసి రాయలేదు. అంతా ఆయన చలవే. సబ్జెక్ట్ లో తక్కువ వచ్చినా, లాబ్ లో మాత్రము ఫుల్ మార్కులు.

ఆ వెలుగు, గుంటూర్ దగ్గర పీజీ కాలేజ్ ఎం సీ యే లో కూడా వెలిగింది, లాబ్ లో ఎప్పుడూ ముందు ఉండే వాళ్ళము. అక్కడ కూడా, డిపార్ట్మెంట్ హెడ్/ లెక్చరర్ అండ దొరికింది. లాబ్ లో ప్రోగ్రాం లు బాగా రాస్తుంటే, ఏ లెక్చరర్ అయినా సంతోషపడి, అండగా ఉంటారు. అందరు ఇద్దరు చొప్పున, కంప్యూటర్ దగ్గర్ ఉంటే, నాకు ఒక్కడికే ఒకటి ఇచ్చేవారు. అప్పటిలో పేజీ ప్రింట్ అంటే అసలు ఇవ్వరు, వారం లాబ్ కి తప్ప.

అలాంటిది, మనకు 1000 లైన్ల సీ లాంగ్వేజ్ లింక్డు లిస్ట్ తో టెక్స్ట్ ఎడిటర్ ప్రోగ్రాం, అప్పటిలో అదే గొప్ప, కోడ్ ఉంటే, తప్పులు పట్టుకోవడానికి లేదా సరి దిద్దడానికి ఎన్ని పేజ్ లైనా ప్రింట్ ఇచ్చేవారు. ఆయన బాగా ప్రోత్సహించారు. అలాగే ఒక మేడం గారు కూడా, ఆ పెద్ద ప్రోగ్రాం కోడ్ ను సరిచెయ్యటానికి తోడ్పడేవారు. లాబ్ లో ఎప్పుడూ మనము ముందు 5 గురిలో ఉంటాము.

అలా గురువులలో ఉత్తమ గురువులు ఉంటారు, దేవుడిలా మనలను ముందుకు నెట్టి ప్రొత్సహిస్తారు అని క్రిష్ణ తో చెప్పాడు. ఈ రోజు నేను కోడ్ ప్రోగ్రాం రాయగలుగుతున్నాను అంటే వాళ్ళే కారణము.

చాల మంది లెక్చరర్ ఉండవచ్చు కానీ, మన మనసు కదిలించే వాళ్ళు కొంత మంది ఉంటారు. వారిని ఎప్పుడూ మరువ రాదు, మన తరపున దేవుడి ఆశీసులు వారీకీ అందుతాయి, ఆయురారోగ్యాలతో ఆనందముగా ఉంటారు అని చెప్పాడు.

వారి క్రుషి, పట్టుదలే, మానవత, మంచి తనం వలననే, ఈ రోజు మనము విదేశాలలో ఉన్నాము అంటే. గురువులకు ధన్యవాదములు.

Algorithm to find max number in the list:

Set max to 0.
For each number x in the list L,
compare it to max.
If x is larger, set max to x.
max is now set to the largest number in the list.


Pascal Code Sample:

program Pascal_triangle;
var d,c,y,x,n : integer;
begin
readln(n);
writeln;
for y:=0 to n do
begin
c:=1;
for d:=0 to n - y do
begin
write(' ');
end;
for x:=0 to y do
begin
write(c);
write(' ');
c := c * (y - x) DIV (x + 1);
end;
writeln;
end;
for y:=n-1 downto 0 do
begin
c:=1;
for d:=0 to n - y do
begin
write(' ');
end;
for x:=0 to y do
begin
write(c);
write(' ');
c := c * (y - x) DIV (x + 1);
end;
writeln;
end;
readln;
end.

  ఉపాధ్యాయ దినోత్సవం - మా డిగ్రీ, పీజీ కాలేజీ గురువుల ప్రొత్సాహం సాఫ్ట్వేర్ బోధనలో - Pic 2


Dt : 05-Sep-2019, Upd Dt : 05-Sep-2019 , Category : General, Views : 118 ( id : 167 )
Tags : teachers day , degree college lecturer , pg college lecturer , BSc Computers , MCA , Bapatla , Guntur

గమనిక : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Note : Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
All best news at one place for NRIs
Multiple source NEWS from 7 yrs
No Ads or Spam, free Content

rightclk =