ప్రపంచ ఆత్మహత్యల నివారణ - కలుపు, భాషించు, రక్షణ - ఇంకొకరికి అండగా ఆశతో జీవించు - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2074 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2109 General Articles and views 1,867,644; 104 తత్వాలు (Tatvaalu) and views 225,086.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
* అందరమొకటై చేయి కలిపితే ఎదురేమున్నది, దిగులేమున్నది, సమస్యల చిక్కేమున్నది
* అమావాస్య తరువాత పౌర్ణమి, చీకటి తర్వాత వెలుగు
* ఆవేశములో, నిర్ణయాలు తీసుకొని, తప్పు మార్గము
* ఆత్మ బలం పెంచి, నిజాయితీ వైపు నడిచే వారితో ఉండాలి
* మన తప్పులు ఉంటే, ఒప్పుకుని, శిక్ష అనుభవించాలి
* శక్తికి మించి దురాశతో చేస్తే ఇలాంటి సమస్యలు వస్తాయి
* పిల్లలకు మానసిక బలం పెంచేటట్లుగా, పెంపకము ఉండాలి
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

*ప్రపంచ ఆత్మహత్యల నివారణ - కలుపు, భాషించు, రక్షణ - ఇంకొకరికి అండగా ఆశతో జీవించు - నరుడి సేవ నారాయణ సేవ*

సనాతన హైందవ ధర్మం, జగమంత కుటుంబం గా భావించి, లోకమంతా పచ్చగా ఉండాలి అని, మన తాత ముత్తాతలకు నేర్పిన గుణం, సంస్కారం ఇవి -

నరుడి సేవయే నారాయణ సేవ Narudi Seva Narayana Seva
మానవ సేవయే మాధవ సేవ Manava Seva Madhava Seva
సర్వేజనా సుఖినోభవంతు Sarvejana sukhinobhavantu

మరి ఏదైనా ఒక్కటి ఆచరిస్తున్నామా, ఈ బిజీ స్వయం పతన జీవితములో? గంట సేపు ఇంట్లో దేవుని ఆధ్యాత్మిక పూజ, గుడిలో తోమాల సేవ, పెంపుడు జంతువుల సేవ, పొట్ట సేవ, చేతుల సంపాదన సేవ, రోజూ మిగతా జీవితములో నటన సేవ. మరి పక్క మనిషి గురించి సమయం ఆలోచన ఎక్కడ?

స్వార్ధముతో, అనుభవ పెద్దల పెత్తనం వద్దు అని, ఉమ్మడి కుటుంబాలను కూల్చి, స్వేచ్చకై పరుగులు తీసి, ఇప్పుడు మనము తోడు మాట్లాడుకునే, ఒక్క సొంత మనిషి లేకుండా పోయాము కదూ? ఏ చిన్న బాధ కలిగినా, మానసిక బలహీనతతో, ఆత్మహత్యలు అంటున్నారు.

ధనవంతులు అధికారులు నాయకులు, అన్ని ఉన్నా ఏమీ లేకయినా, పెద్ద తేడాలేదు సుమీ. ధనం హోదా అధికారం పలుకుబడి పెరిగే కొద్దీ, ఒంటరితనం పతనం కూడా వెంటపడుతుంది, అని చాలా మంది మూర్ఖులు గ్రహించలేరు, చెప్పినా వినరు.

కుటుంబము ఉన్నా పిల్లలు ఉన్నా, ఎవరూ ఎవరి గురించి పట్టించుకోరు బతికి ఉన్నప్పుడు. అబ్బో పోయాక ఇక చూడాలి, సందేశాలు కన్నీళ్ళు శ్మ్రుతులు గతాలు కీర్తనలు సంకీర్తనలు నటనలు నాటకాలు డప్పులు దరువులు కటౌట్లు విగ్రహాలు.

చచ్చాక గంధపు చెక్కల తో తగల పెట్టడం, లక్షమందికి సంతర్పణం, పేపర్లో టీవీలో ఏడుపులూ అబద్దాలు, అబ్బో ఇక జీవించేస్తారు, ప్రాణం బంధం విలువ గురించి.

మరి ఇవన్నీ ప్రాణం తో మనిషి ఉన్నప్పుడు? ఒక్క రూపాయ, ఒక్క ప్రేమ మాట, ఒక్క ధైర్యపు చెయ్యి, అబ్బే, మేము చాలా బిజీ అండీ, మేము ఎవరి మాట వినము ఎవరినీ లెక్క చేయము, మా మరియు మా పిల్లల, స్వయం పతన భవిష్యత్తులో అని కోతలు.

నిన్న పేపర్లో వచ్చింది, 12 ఏళ్ళ పిల్లాడు, ఇంటర్నెట్ లో చూసి ఆల్కాహాల్ తయారుచేయడం నేర్చుకున్నాడు, తల్లి దండ్రులు నన్ను పట్టించుకోక గాలికి వదిలేయబట్టీ, ఈ ఘన విజయం సాధించాను అని గర్వముగా చెప్పారంట, ఈ గొప్ప అంతా మా పేరెంట్స్ కే చెందాలి అన్నారంటా. ఇప్పుడు ఆ పేరెంట్స్ ఏడవాలా, నవ్వాలా?

అది మన బిజీ బతుకు, సొంత పిల్లల కే సమయము లేదు. ఇంక సొంత ముదుసలి తల్లి దండ్రుల వాసనలు అసలు వద్దు, అంత డబ్బు విదిలించి, చుట్టాలతోనో, ఒంటరిగా ఆస్తులకు కాపలానో, లేక అనాధాశ్రమములో వేస్తే చాలు. ఇంక స్నేహితులు బంధువులు, అవసరానికి? అంతేనా . . .

సొంత మనుషులు అందరు పనికి రాకుండానో లేదా పైకి పోయాక, ఆ 40 కోట్లు, 4 ఇళ్ళు, 40 తులాలు, 40 సెంట్లు తో ఎక్కడ ఊరేగుతారు? వాటి కోసము మిమ్మల్ని మాత్రం బలితీసుకోరా, అవసర అవకాశవాదులు?

ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినము అని ఒకటి ఉంది తెలుసా? కలసి పని చేద్దాం ఆత్మహత్యలను నివారిద్దాం. మాట కలుపుదాం, సంప్రదించుదాం (భాషించు), రక్షణ ను ఇద్దాము లేదా తీసుకుందాము.

మేము 20 ఏళ్ళు గా ఎంతో మంది, కష్ట సుఖాలు గంటలు గంటలు విని, వారిని ఓదార్చి, వారి కుటుంబానిని నచ్చచెప్పి, వారికి మంచి దోవ చెప్పి, వారికి భవిష్యత్ పై ఆశ నిలిపాము.

ఇప్పుడు మీరు చదువుతున్న లోతు అర్ధం సాధారణ సమాజ సహజ 1500 కధనాలు లో కొన్ని వారివే. మనము కనీసం 50 మందికి రోజూ, తమ అరిషడ్వర్గాలకు అష్ట వ్యసనాలకు బానిసలు అవ్వద్దు అని గుర్తు చేస్తూ, పలకరిస్తూ ఉన్నాము ఏళ్ళుగా, వారు స్పందించకపోయినా.

ఎందుకంటే, వారి కుటుంబములో లేని సంస్కారం, వారిని స్పందింపచేయదు. కానీ మనము మనుషులు గా మార్చే ప్రయత్నం మానకూడదు. అదే దైవానికి, మానసిక పూజ, నరుని సేవ.

మరి మీరు, నరుని సేవ చేస్తున్నారా? చేయకపోతే, నారాయణ సేవకు గంట ధ్యానం కు అర్ధం ఏముంది, అంతా నటనేగా?

ఆడుతు పాడుతు పని చేస్తుంటే, అలుపు సొలుపే మున్నది, అందర మొకటై చేయి కలిపితే ఎదురేమున్నది, మనకు ఇంక దిగులేమున్నది, సమస్యల చిక్కేమున్నది.

ఈ రోజులలో చాలా మంది, సమస్యలు నుంచి దూరంగా వెళ్ళాలి అని, తమ చేతులారా జీవితాలను దూరం/ నాశనం చేసుకుంటున్నారు. ఇంకొంతమంది, చిన్న చిన్న సమస్యలకు కూడా, ముందు చూపు లేకుండా, అదే మార్గము ఎంచుకుంటున్నారు.

దాని వలన సాధించేది ఏమి లేకపోయినా, తమను నమ్ముకున్న వారిని, ఇబ్బందులలోకి నెట్టి, పరువు ప్రతిష్టలు, మిగతా కుటుంబాన్ని, నట్టేట ముంచి వెళుతున్నారు. రోజూ పేపర్లో ఏదో ఒక వార్త, పిల్లలు దగ్గర నుంచి పెద్దల దాకా, బీదల నుంచి మిలియనీర్లు దాకా.

పదవ తరగతి పరీక్ష పాస్ కాలేదని, సెల్ ఫోన్ కొనీయ లేదని, భర్త లేదా భార్య మాట వినక గొడవ చేస్తున్నారు అని, అప్పులు ఎక్కువ అయ్యాయి అని, పంట పండలేదని, పెద్దలు లేదా పిల్లలు సరిగ్గా చూడలేదని, ఒంటరిగా వదిలారు వదులుతారు అని, ఇలా చాలా కారణాలు చెపుతున్నారు.

ప్రతి సమస్యను దగ్గరగా ఆలోచన చేసి చూస్తే, పరిష్కారము కనిపించవచ్చు. కానీ ఆవేశములో, నిర్ణయాలు తీసుకొని, తప్పు మార్గము ఎంచుకుంటున్నారు. ఎక్కువగా మన తప్పిదాలు పొరపాట్లే ఉంటాయి ప్రతిదానిలో. కాని ఎవరు చేసే ముందు ఆలోచన చేయరు, ఎవరైనా చెప్పినా వినరు ఆ మాకు తెలీదా ఆ మాత్రం అని.

అందుకే, అన్ని బాగున్నప్పుడు అహంకారం తో ఉండకూడదు. నేల మీద నడవాలి. పెద్దలు మరియు మంచి వారి మాట వినాలి. ఈరోజు వారి ముందు చూపు మాట మనకు నచ్చకపోవచ్చు, కానీ రేపు చాలా ఉపయోగం. ఆత్మ బలం పెంచి, నిజాయితీ వైపు నడిచే వారితో రోజూ మాట్లాడుతూ ఉండాలి, మనల్ని కింద పడకుండా, నిరంతరం మేలుకొలుపుతారు అప్రమత్తము చేస్తారు.

ఈరోజు మనది కావచ్చు కానీ విర్ర వీగకూడదు, రేపు మనది కాదు ఖచ్చితముగా కాదు. ఇంతకుముందు అనుకున్నాము, హోదా ఐశ్వర్యం అధికారం కాపాడవు, మన మంచి తనమే కాపాడుతుంది. ఓ మంచి మాట కాపాడుతుంది, ఇతరుల మానసిక బలం, మన జీవితము పై ఆశ కలుగుతుంది పెంచుతుంది.

జాగ్రత్తలు, మనసు కష్టం గా ఉంటే చెప్పండి లేదా మీ పెద్దలు తో అనుభవజ్ఞులతో మాట్లాడండి. మంచి వారితో మాట్లాడనిదే, మంచిదోవ కనపడదు. మన తప్పులు ఉంటే నిజాయితీగా ఒప్పుకుని, ఇక్కడే శిక్షలు అనుభవించాలి. పరలోకం పారిపోకూడదు, ఒకవేళ పోయినా, తర్వాత అయినా వడ్డీతో సహా ఇంకా అనుభవం శిక్షా తప్పదు.

ఉదాహరణకు పదవతరగతి విధ్యార్ధి సంవత్సరము మొత్తము బాగా చదివి, పరీక్షలో పొరపాటున తప్పినా కూడా, తల్లి దండ్రులు అర్ధము చేసుకుంటారు. తర్వాత అవకాశాము ఉంది.

పంట వేసేటప్పుడు, మన తాహతుని బట్టి పంట వేయాలి, వ్యాపారము అయినా అంతే. గొప్పకు పోయి, అప్పులు చేస్తే, తీర్చలేక తలనొప్పి. రిస్క్ తీసుకోవాలి కానీ, మనము మునిగిపోయేంత కాదు.

శక్తికి మించి దురాశతో చేస్తే ఇలాంటి సమస్యలు వస్తాయి. పొరపాటు జరిగినా, మాట్లాడి ఎదో ఒక దోవ చూసుకోవాలి. లేకపోతే, కుటుంబ సభ్యులు లేదా నమ్ముకున్న వారు అనాధలవుతారు .

పాత రోజులలో, ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. సమస్యలు అందరు కూర్చొని మాట్లాడుకొని, పరిష్కరించుకునేవారు, ఇంటి పెద్ద మాట విని. ఈ రోజుల్లో అన్ని విడి విడి కుటుంబాలే, ఎవరి మాట ఎవరూ వినరు, ఎవరినీ సంప్రదించరు.

సాగినన్ని రోజులు హయిగా సాగి, సమస్యలు వచ్చేసరికి ఏమి చేయాలో తెలీక తలలు పట్టుకుని, ఇలాంటివి కొని తెచ్చుకుంటున్నారు.

పెద్ద సమస్యలు వచ్చినప్పుడు పెద్దలతోనో, చుట్టాలతోనో, స్నేహితులతోనో చెప్పి పరిష్కార సూచనలు పొందాలి. మన అనుభవానికి రాని జవాబులు వారు చెప్పొచ్చు. వాటిలో మనకు నచ్చిన, మంచి పద్దతి అనుసరించవచ్చు.

పిల్లలకు మానసిక బలం పెంచేటట్లుగా, పెంపకము ఉండాలి. కానీ ఈరోజుల్లో పిల్లలను దూరంగా హస్టల్ లో వేసి పెంచుతున్నారు. వారికి రామాయణం, గీత, భారతం వంటి కధల పాత్రలు చెప్పి, తెలివి తేటలు పెంచవచ్చు.

కాని అంత సమయము పెద్దలకు ఉండటము లేదు కదా, తమ సొంత పనులతో. ఫలితము అందరము అనుభవిస్తున్నాము.

పిల్లలు దగ్గర ఉన్నా కూడా, అతి గారాభము చేసి, కష్ట సుఖాలు తెలియకుండా పెంచుతున్నారు. దీనితో రేపు ఏ చిన్న సమస్య వచ్చినా, వారి కేమి చేయాలో తెలియదు. తొందరపాటు నిర్ణయాలు చేస్తారు, ఇంకొన్ని సమస్యలు వస్తాయి.

మన శాస్త్రాల ప్రకారము కూడా, ఆత్మహత్య మహా పాపము. మరలా ఆ బాధలు తరువాతి జన్మలో మరలా ఎదుర్కొనాలి, కాబట్టి ఈ జన్మలోనే సక్రమము గా ఉండి, అలాంటి పరిస్తితి తెచ్చుకోవద్దు.

అందుకే మనము నమ్మే వారితో కష్ట సుఖాలు పంచుకుంటూ, మానసిక బలము పెంచుకుంటూ, జీవితాన్ని ఆనందమయముగా జీవించాలి. మన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు అండగా ఉండాలి. అలాగే అవసరమైతే అండ తీసుకోవాలి. మన ఉత్తమ గురువు/ శిష్యులు మన చుట్టూనే ఉంటారు, అహంకారముతో గ్రహించము.

అమావాస్య తరువాత నిండు పౌర్ణమి వస్తుంది, అలాగే చీకటి తర్వాత వెలుగు వస్తుంది. ఇది అందరికీ తెలుసు కదా, ఓపిక పట్టాలి. మన తప్పులు ఉంటే, సరి చేసుకోవాలి. కర్మ ఫలమైతే, ఆనందముగా ఆస్వాదించాలి. కొత్త మలుపు కోసము ఎదురుచూడాలి.

చావు దేనికీ పరిష్కారము కాదు, పిరికితనానికి సంకేతము మాత్రమే. మనము తప్పుడు వారిగా మిగిలిపోతాము. చావే తేలిక మార్గం అనుకుంటే, బహుశా ఎవరూ మిగలరు. ఉన్నంతలో హయిగా సంతోషముగా, జీవించాలి. భవంతుడు భవిష్యత్ లో అందించే చేయి, అందుకోవాలి అంటే, మనం బతికి ఉండాలి కదా మిత్రమా.

ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ సూసైడ్ ప్రివెన్షన్ (IASP) రూపొందించిన అధికారిక ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం ప్రతిసంవత్సరం సెప్టెంబర్ 10 న చేస్తారు అందరికి అవగాహన కలిగించాలి అని. కలసి పని చేద్దాము, ఆత్మహత్యలను నివారిద్దాము.

WSPD బ్యానర్లు, వివిధ భాషలలో ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినపత్రిక, లైట్ ఎ కాండిల్ పోస్ట్ కార్డులు, WSPD వాస్తవాలు మరియు గణాంకాలు మరియు వనరులను కనుగొనడానికి వారి వెబ్ సైట్ను చూడవచ్చు. ప్రతి సంవత్సరం జనాదరణ పెరుగుతున్న IASP యొక్క సైకిల్ ఎరౌండ్ ది గ్లోబ్ ఈవెంట్ గురించి కూడా మీరు తెలుసుకోవచ్చు.

10 September - World Suicide Prevention Day

* Working Together to Prevent Suicide.
* Light a Candle Near a Window at 8 PM.
* Cycling Around the Globe 10 Sept – 10 Oct

The International Association for Suicide Prevention (IASP) is dedicated to:

preventing suicidal behaviour, alleviating its effects, and providing a forum for academics, mental health professionals, crisis workers, volunteers and suicide survivors.

Founded by the late Professor Erwin Ringel and Dr. Norman Farberow in 1960, IASP now includes professionals and volunteers from 77 countries. IASP is a Non-Governmental Organization concerned with suicide prevention. IASP.  

Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2109 General Articles and views 1,867,644; 104 తత్వాలు (Tatvaalu) and views 225,086
Dt : 13-Sep-2019, Upd Dt : 13-Sep-2019, Category : General
Views : 1946 ( + More Social Media views ), Id : 165 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : IASP , WSPD , World Suicide Prevention Day , Erwin Ringel and Norman Farberow
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content