APLatestNews.com top Banner
ఫాస్ట్ ఫుడ్ నోటికి పెట్టు, అనారోగ్యం శరీరానికి పట్టు, పతనానికి అదే తొలి మెట్టు - లోకం తీరు
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. మంచి కోరే వారికి దీనిని పంపగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
ఈ రోజుల్లో రోడ్ల వెంట దుమ్ము ధూళిలో లేదా పెద్ద షాపు లలో ఫాస్ట్ ఫుడ్ తినడం ఫాషన్ అయ్యింది. వండాలంటే బద్దకం, పిల్లలకు కూడా ఆ చెత్త ను పెడతానికి, ఏ తల్లి దండ్రులు వెనకాడడం లేదు.

విమానాశ్రయంలో ఇద్దరు తల్లులు అనుకుంటున్నారు ఇలా. మా పాప, పిజ్జా కోక్ లేనిదే రోజు కొకసారి ఊరుకోదండి. ఇంకొక తల్లి, మా బాబూ అంతే, ఫాస్ట్ ఫుడ్ అంటే ప్రాణం, చికెన్ ఫ్రైస్ పెప్సి లేకుండా అసలు ఊరుకోరు. మరి, ఇక రాబోయే తరము ఎలా ఉంటుందో చెప్పండి.

పిజ్జా, రొట్టె లో కూర గాయల ముక్కలు. మైదా పిండి తో చేస్తారు అనుకుంట. చీజ్ వేస్తారు. ఎక్కువ రోజులు పాడవకుండా ఉండటము కోసం, ఏమేమో కలుపుతారు.

బర్గర్‌, పేస్ట్రీలు, నూడుల్స్ , పఫ్ లు, పరాటాలు , ఫ్రెంచ్ ఫ్రైస్, చిప్స్ , పిజ్జా, వేపుడు తిండ్లు, కోలా పానీయాలు, మనిషి శరీరానికి ఎక్కువ కేలరీలు కొవ్వును అందించి జీర్ణాశయం కు ప్రమాదం తెచ్చిపెడుతున్నాయి. మైదా పిండి తో చేసింది, ఏదైనా కూడా మంచిది కాదు.

మిరపకాయ బజ్జీలు, ఇడ్లీ, దోసె, సమోసా, పకోడా, వంటివి అంతగా హాని కాని ఫాస్ట్‌ఫుడ్స్‌ క్రిందలెక్క. కానీ అవి ప్రమాదమే, ఏ నూనె వేస్తారో, ఎన్ని సార్లు కాచింది వాడుతారో కదా. ఇక మాంసము ఉత్పత్తులు అనుకోవడము అనవసరము.

కొంతమంది, అబ్బా ఎంత మంది తినడము లేదండి, అలా భయపడితే ఎలా అంటారు? ఆ ప్రశ్న ను కొంచెము మార్చి చెప్పండి. ఎంత మంది ఖర్చు చేసుకుంటూ, ఆసుపత్రి చుట్టూ తిరగడం లేదు, మనమూ తిరుగుదాము అని. అప్పుడు మీ ఇష్టము, సిద్ధము అయ్యారు కాబట్టి.

తప్పనిసరి అయితే, నెలకి ఒక్కసారి తినడం వేరు, రోజూ లేదా వారానికి అదే పని గా తింటే, జీర్ణ వ్యవస్థ కుప్పకూలడం ఖాయం.

కొవ్వు తేలికగా, ఉచితంగా పెరగడానికి తేలిక మార్గం. ఫాస్ట్ ఫుడ్ తినండి లావు బరువు పెరగండి. దానికి కోక్ కూడా కలిపితే ఎక్కువ నాశనం పొట్టకు. ఉచిత గాస్, ఊబకాయం కూడా.

కొలెస్ట్రాల్ పెంచుకోండి, హస్పిటల్ ను కాపాడండి అన్నారు అంట గుంటూరు అప్పారావు గారు అప్పుడెప్పుడో నవ్వుతూ.

మరి మనం ఆ ప్రయత్నం లోనే ఉన్నాం కదూ. ఏ మాత్రం తగ్గవద్దు, మన ఇంట్లో వాళ్ళు ఎలాపోయినా, డాక్టర్లను బతికిద్దాము, అదేనా మన ఉద్దేశ్యం.

ఇంటి ఇడ్లి, దోశ, అరటిపండు, కారెట్ , నీరు, పెరుగు అన్నము ఉత్తమం.
 

Dt : 03-Aug-2019, Upd Dt : 03-Aug-2019 , Category : General
Views : 309 ( + More Social Media views ) ( id : 144 )
Tags : fast food , health issues

గమనిక : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Note : Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 7 yrs
No Ads or Spam, free Content