APLatestNews.com top Banner
         
మన ప్రతి పనికి జవాబు చెప్పాలి, శిక్ష అనుభవించాలి ఏదో ఒక రోజు - లోకం తీరు
OurTripVideos - Visiting Places/Local Events Pictures and Videos. We visit, We record, We present, You Enjoy!
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. మంచి కోరే వారికి దీనిని పంపగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
మనం పళ్ళు, ఒళ్ళు రోజూ శుభ్రం చేసుకోకపోతే ఎలా ఉంటుంది. ముందు మనకే వెగటు పుడుతుంది. తర్వాత ఇంట్లో వాళ్లు, దూరం పెడతారు.

మరి ప్రపంచ విషయ వాసనల లో, ప్రతిక్షణం పరుగులు తీసే, కోతి మనసు ను ఎంత శుభ్రం చేయాలి రోజూ? ఎంత సాధన చేయాలి?

చేయకపోతే? మనసు కప్పివేయ బడుతుంది, మనము ఏమి చేస్తున్నామో మనకే తెలీదు. తప్పును కూడా ఒప్పే అనుకుంటూ అగాధంలో కూరుకు పోతాము.

తర్వాత, లోకమే దూరం పెడుతుంది లేదా లోకాన్ని విడిచి మనమే పోతాము. నమ్మరా.

దేవుడు డబ్బు ఇచ్చి కొందరిని పరీక్ష చేస్తారు. నేలమీద, నీతి గా నడుస్తున్నారా, మానవత్వం తో అని. కానీ మనం అహంకారంతో అత్యాశతో, కోరి కొని కష్టాలు తెచ్చి నడి ఇంట్లో పెట్టుకుంటాం. చూసారు కదా, కర్ణాటక కోటీశ్వర యజమాని, నదిలో తేలారు.

డబ్బులేనప్పుడు లేదు అని ఏడుస్తాము, ఉంటే ఏదో చేస్తాము అని ఉహలలో తేలియాడుతాము. దోవ తప్పితే, ఇలా నీటి మీద తేలుతాం లేదా గాలిలో తేలి విదేశాల్లో దాక్కుంటాము.

అలాగే డబ్బు ఇవ్వకుండా కొంతమంది ని పరీక్ష చేస్తారు. నీతి గా ఉండ గలరా అని. మనం నీతి తప్పకూడదు. ఎందుకంటే పడకుండా చూసే బాధ్యత కూడా ఆయనదే అని నమ్మాలి.

జాగ్రత్తగా ఉండాలి మనం, మన ప్రతి పనికి జవాబు చెప్పాలి, శిక్ష అనుభవించాలి ఏదో ఒక రోజు.
 
Dt : 03-Aug-2019, Upd Dt : 03-Aug-2019 , Category : General, Views : 119 ( id : 143 )
Tags :

గమనిక : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Note : Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 7 yrs
No Ads or Spam, free Content