APLatestNews.com top Banner
బయట తింటే అనారోగ్యం, పాచిన తిండే ఎక్కడైనా, మేమా ఇంట్లో వంటా? - లోకం తీరు
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. మంచి కోరే వారికి దీనిని పంపగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం / వీడియో మరువద్దు.

మీరు ఎన్ని అయినా చెప్పండి, మాకు వళ్ళు వంగదు. అబ్బా, మా బరువు తగ్గాలి అనా, మా ఆసుపత్రి కి నష్టం చేయాలనా, మా డబ్బులు మిగలాలి అనా? కుదరదు గాక కుదరదు, అంతే.

వ్యాపారం లో లాభం ముఖ్యమని మాకు తెలీదా, మా వ్యాపారం లో మేము అలాంటివి చేయడం లేదా? బయట తింటే అనారోగ్యం, పాచిన తిండే ఎక్కడైనా, అంతే. మసాలా దినుసులు కొట్టు, కుళ్ళు గబ్బు దాచిపెట్టు. ఇక కల్తీ గురించి ఒక గ్రంధమే రాయొచ్చు.

నలుగురితో నారాయణా, పాచి తిండే గతి నాయనా. ఇంట్లో చేసుకోము, మాంసం లేదా బయట తిండి వదులుకోము. నాలుకను అదుపులో పెట్టుకోము. పెద్ద ఊళ్ళ వి ఎన్నో సార్లు వేసారు, మేము మానామా?

ఈ షాప్ ఫోటో వేశారు కాబట్టి, ఇంకో షాప్ లో తింటాము. దాని ఫోటో కూడా పడిందాకో లేక మాకు రోగం వచ్చిందాకో కొనసాగిస్తాము. అబ్బా మేము మారం గాక మారం. మొన్నటి ఇడ్లి, దోశ, బిర్యాని, గారె, అన్నమయినా, వారం ముందు చట్ని సాంబార్ కూర అయినా సరే, ఓకే. అందులో ఏ చెత్త, చెమట లేదా జంతువుల నూనె వేసినా సరే. మేము వండము మా ఇంట్లో, పెళ్ళి అప్పుడే ఒప్పందము చేసుకున్నాము.

సరే గాని, మన చుట్టాలు వస్తున్నారు. ఉదయం హోటల్ నుండి ఇడ్లి సాంబార్, మధ్యాహ్నం మటన్ బిర్యాని, సాయంత్రము పునుగు బజ్జి తీసుకురా తమ్ముడు - ఓ సగటు తెలివైన చదువుకున్న మనిషి.

వార్త - బిర్యానీ హౌస్ లో కిలోల మాంసాన్ని గుర్తించిన అధికారులు, అది కుళ్ళిపోయి ఉండడం చూసి ఖంగుతిన్నారు. అది పనికి రాకుండా కెమికల్స్, ఫినాయిల్ పోశారు. పరిశుభ్రత పాటించని హోటళ్ళను సీజ్ చేయడంతో పాటు ఫైన్ వేశారు. హోటల్ ఓనర్ శుభ్రత పాటించాలని, నాణ్యమైన ఆహారాన్ని ప్రజలకు అందిచని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
 





Dt : 27-Jul-2019, Upd Dt : 27-Jul-2019 , Category : General, Views : 190 ( id : 140 )
Tags : bad biryaani , old meat , Food Adulteration

గమనిక : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Note : Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 7 yrs
No Ads or Spam, free Content