APLatestNews.com top Banner
ఒంటరి మంచి వాళ్ళకు దేవుడే స్నేహితుడు, తక్కువ బంధాలు తలనొప్పులు - లోకం తీరు
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. మంచి కోరే వారికి దీనిని పంపగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
మాకు తెలిసిన ఒకాయన మొన్న మాట్లాడుతుంటే చెప్పారు. ఒంటరిగా ఉంటున్నా, చుట్టూ ఎవరూ పలకరించరు. చుట్టాలు దూరంగా ఉన్నా, దగ్గర గా ఉన్నా తేడా లేదు, సహాయం చేయరు పట్టించుకోరు అన్నారు. చాలా బోర్ గా ఉంటుంది, బాధగా కూడా ఉంటుంది అని మధన పడ్డారు.

అనకాపల్లిలో అయినా, అమెరికాలో అయినా అవసరము లేని మనుషులతో ఎవరూ పలకరు, అందరం అవకాశవాదులమే. నలుగురు ఉన్నవాళ్ళు విర్ర వీగినా ఇప్పుడు, తర్వాత పిల్లలు వదిలేసినాక, వాళ్ళూ ఒంటరులే అనాధలే. మనకు ముందే అనుభవం ఉంది, కాబట్టి చివరలో ఎక్కువ బాధపడము. కానీ వారు, ఎంత చేసాము, ఎంత కష్టపడ్డాము, చివరకు నా బతుకు ఇలా అయ్యిందే అని మానసికం గా కుళ్ళిపోతారు.

మీరు బాధపడాల్సిన విషయము ఏమి లేదు ఇక్కడ, హాయిగా సంతోషంగా ఉండండి అని ధైర్యము చెప్పాను. అదేమిటీ అలాగ అంటావు అన్నారు.

కుటుంబాలతో మాట్లాడితే మీకు తెలుస్తుంది, మేడి పండు చూడ మేలిమై ఉండు వేమన గారి పద్యము గుర్తు లేదా. ఒకరు ఉన్నా, పది మంది ఉన్నా ఈ సమస్యలు అందరికి ఉన్నవే, కొంచెము ముందు వెనుకా అంతే. వాళ్ళకు ఉన్న ఎగస్టా బాధా, రెండో మనిషి నుంచి తప్పించుకోలేరు. భరించలేక తగువులు, తన్నులు, కోర్టులు. అటు చుట్టాల ఇటు చుట్టాల సమస్యలు ఇంకొన్ని. పిల్లలు లేక పోతే ఒక బాధే, ఉంటే మాత్రము అనేక బాధలు.

సమాజానికి ఉపయోగపడే పిల్లలను కనాలి అని పెళ్ళి , కుటుంబ విధానం పెట్టారు. కానీ ఇప్పుడు ఎవరికి వారే యమునా తీరే లాగ ఉంది అందరి పరిస్తితి. కానీ సొంత పిల్లలే ఈ రోజుల్లో కన్న తల్లి దండ్రులకు ఉపయోగపడటం లేదు. నరకము చూపిస్తున్నారు చివరి రోజుల్లో, మరికొంత మందికి చిన్నప్పుడు నుండే మొదలు బాధలు మాటవినక. అందులో పెద్దల పెంపకము కూడా తప్పే, ఫలితం అనుభవిస్తున్నారు. కాబట్టి, ఈ విషయములో మీరు అద్రుష్టవంతులు.

పది మంది మీ దగ్గరకు వచ్చినా, లేని పోనివి పది చెప్పి, తగువు లోకి లాగుతారు. అటు మాటలు ఇటు, ఇటు మాటలు అటు చేరవేస్తారు, తగువులు పెడతారు, నటించి కొంప ముంచుతారు. కాబట్టి, తక్కువ మనుషులతో మాట్లాడేవాడు, సంతోషముగా ఉంటాడు.

బోర్ కొడితే, రామాయణ, భారతం, గీత, వేమన శతకాలు లాంటివి చదివిన మనసుకు శాంతి. దైవ నామ స్మరణ, జపాలు, తపాలు ఉత్తమం. దైవాన్ని తలచుకోటానికి మీకు కావలసినంత సమయం. టీవీ లో మంచి భక్తి కార్యక్రమాలు చూడొచ్చు.

దగ్గర లోని గుడి లో, సాయంత్రం భజన, పురాణ కాలక్షేపం కు వెళ్ళవచ్చు. తోటి ఒంటరి లేదా మంచి వారికి లేదా పదిమందికి పనికి వచ్చే పనులు సాధ్యమైతే చేయవచ్చును. తోట పని, నడక, యోగ, ధ్యానం మంచిది. ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి, ప్రక్రుతిని చూసి అన్నా ఆనందముతో.

దిక్కు లేని వారికి దేవుడే దిక్కు అంటారు. గుడిలో దేవుళ్ళే మన చుట్టాలు, ఎన్ని సార్లు వెళ్ళినా ఎందుకు వచ్చావు అని అడగరు, అంతో ఇంతో ప్రసాదం కూడా పెడతారు. తర్వాత కాలంలో మిగతా అందరికి వచ్చే ఓంటరి తనము లో, మనమే సీనియర్లము అను కొని ధైర్యముగా ఉండాలి అని చెప్పాను అన్నాడు రవి, సోము తో.
 

Dt : 23-Jul-2019, Upd Dt : 23-Jul-2019 , Category : General
Views : 293 ( + More Social Media views ) ( id : 139 )
Tags : single person feelings , ontari manishi

గమనిక : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Note : Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 7 yrs
No Ads or Spam, free Content