APLatestNews.com top Banner
         
నమ్మక ద్రోహం కు ఇంట్లో వారేనా, బయట వాళ్ళ కు ఆ హక్కు లేదా అధ్యక్షా? - లోకం తీరు
OurTripVideos - Visiting Places/Local Events Pictures and Videos. We visit, We record, We present, You Enjoy!
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. మంచి కోరే వారికి దీనిని పంపగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
వడ్డీకో లేదా మామూలు సందర్భాలలో, ఎటూ ఇచ్చిన ధనం వెనక్కు రాదు. కానీ అత్యవసర ప్రాణాపాయ లేదా ఆపరేషన్ కు చేబదులు ఇస్తే కూడా, మరచే క్రుతఘ్నులు ఉన్నారు.

చిన్నప్పుడు మన ఇంటి దగ్గర లో పెరిగిన అబ్బాయి, అత్యవసరం తమ్ముడు ఆపరేషన్ అని చెపితే, రెండు రోజుల్లో 10 మరలా 10 వేలు(మొత్తం 20) సర్దుబాటు చేసాము, నెలలో ఇస్తాను చేబదులు అంటే, షుమారు 2 ఏళ్ళ క్రితం. వాళ్ళ అమ్మ గారి కి కూడా తెలుసు.

ఆపరేషన్ నిజం, తమ్ముడుకి పరిస్తితి బాగోనిది వాస్తవమే. ప్రభుత్వ ఉద్యోగం, 15 ఏళ్ళ తర్వాత కలిసారు, నక్క వినయం అని తెలిసినా, పరిస్తితిని బట్టి ఇవ్వవలసి వచ్చింది. చేబదులు అంటే వడ్డీ లేకుండా నమ్మకముతో కాగితం లేకుండా.

కానీ అవసరం తీరాక , గతం గుర్తు ఉండదు కదా, క్రృతజ్ఞత లేని వారికి, అతివినయం నటించే వారికి. అలాంటి వారు పక్కన ఉన్నా, పాము తో సమానం అని అంటారు. ఎందుకంటే అది కూడా పాలు పోసినా, అవకాశం కోసం ఎదురుచూసి కాటు వేస్తుంది పోసిన వారినే.

అటువంటి వారు మన చుట్టు చాలా మంది ఉంటారు, తీయటి మాటలు చెపుతూ. మాటలు చేష్టలు కలవవు.

6 నెలల తర్వాత కూడా, ఇంకా ఇస్తాను అక్కౌంట్ నంబర్ ఇవ్వండి అని 6 వ సారి అడుగుతూనే ఉన్నాడు. ఇప్పుడు కూడా, 7 వ సారి అక్కౌంట్ నంబర్ ఇవ్వకుండా నేనెల ఇచ్చేది, నా దేమి తప్పు లేదు అంటారు.

మనసులో నవ్వుకోని, పిచ్చి వాడా, అవి తిరిగి ఇచ్చి ఇంకా అడిగితే, ఇంకా ఎక్కువ ఇచ్చేవాళ్ళము, ఎక్కువలో మోసం చేసే వాడివి.

కానీ నీ బుద్ది, దేవుడు అప్పుడే తొందరగా బయట వేశాడు. ఇంక ఇవ్వ అవసరం లేదు, దానం అనుకో, ఇంకోసారి ఇటువైపు రావొద్దని చెప్పాము.

తర్వాత మాటలు లేవు. అందుకే, డబ్బు ఇచ్చి , శత్రువు ల ము కాకూడదు. అలాగే, అపాత్రాదానం చేయకూడదు.

ఈ కాస్త దానికే ఇబ్బంది అయితే ఎలా, ఇంకాస్త ఇచ్చి పెద్ద మొత్తము లో, మోసపోదాము అనుకునే పుణ్యమూర్తులూ, మొహమాటస్తులూ కూడా ఉన్నారు. ఒక లక్ష లేదా అంతకు మించి మోసపోతే గాని త్రుప్తి కలగదు, తప్పుడు మనిషి అని తెలిసి కూడా ఇస్తూనే ఉంటారు.

ఇక్కడ ప్రశ్న డబ్బు గురించి కాదు, మనం పోగొట్టుకుంటున్న విలువల గురించి :

1. అత్యవసర పరిస్తితిలో సహాయం చేసారు అన్న క్రుతజ్ఞత లేదు. రేపు మరలా అవసరానికి దొరుకుద్దా?
2. ఇబ్బంది ఉంటే, చెప్పుకుని అంతో ఇంతో ఇస్తూ ఉంటే, విలువ ఉంటుంది అన్న ముందు చూపు లేదు. ఆ ఇంకొకరు దొరకకపోతారా అన్న నిర్లక్ష్యం.
3. కన్న తల్లి కూడా, అదే బుద్దితో, కొడుకుకి చెప్పలేని దౌర్భాగ్యం. మరి రేపు తన పిల్లలకు ఏమి మంచి నేర్పుతారు?
4. ఇంకొక మంచి మనిషి కష్టంలో ఉంటే, మనము సహయం చేయ గలమా? వారికి కూడా దోవలేకుండా చేస్తున్నారు.
5. ఇలాంటి వ్యక్తి తన ఉద్యోగ నిర్వాహణ లో నీతి, నిజాయితీగా ఉంటారా లంచాలకు కక్కుర్తి పడకుండా ఉండగలరా?
6. ఒకరిని చెయ్యి చాచి అడగటమే దౌర్భగ్యం, అందులో సహాయానికి మోసం చేయడం ఇంకెంత దౌర్భాగ్యమో. ఆ ఈ రోజుల్లో అందరం అంతే అంటారా?

ఇదేమి కొత్తా మనకు, నమ్మక ద్రోహం ఇంట్లో వారే చేస్తున్నారు, బయట వాళ్ళ కు ఆ మాత్రం హక్కు లేదా అధ్యక్షా , అంటే? నమ్మిన వాళ్ళనే మోసము చేస్తారు గాని, నమ్మని వాళ్ళను ఎలా చేస్తాము అధ్యక్షా అన్నా, నవ్వి గమ్ము గా ఉండటమే. ఎందుకంటే, కాలమే వాటికి మరియు వారికి జవాబు చెబుతుంది.
 
Dt : 17-Jul-2019, Upd Dt : 17-Jul-2019 , Category : General, Views : 172 ( id : 138 )
Tags : loan defaulter , cheating friend relative , emergency help

గమనిక : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Note : Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 7 yrs
No Ads or Spam, free Content