ఫలితాల తర్వాత సిత్రాలు - బెజవాడలో జగన్, పక్కనేమో చంద్ర , డిల్లీలో - Politics - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2073 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2108 General Articles and views 1,863,729; 104 తత్వాలు (Tatvaalu) and views 224,708.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

సరదాకి మాత్రమే, ఈ రోజులలో పరిస్తితి , ఎవరెవరో చెప్పుకోండి చూద్దాం మీ తెలుగు భాష మరియు కనీస రాజకీయ పరిజ్ఞానానికి చిన్న పరీక్ష.

1. నా కొడుకును ఎక్కిద్దాం అంటే ఈడోడు కాదంటిరి
మా ఆవిడేమో కమలాన్ని విడవదాయే, ఒకే పార్టీ వద్దని
మా ఊరి ఎమ్మెల్లే మంత్రి నై, తోడల్లుడిని మురిపిద్దామనుకుంటే,
దీని తస్సాదియ్యా , మా పార్టీని గెలిపించి, నన్ను ఓడిస్తిరే

2. రాజన్న బిడ్డ, కోలుకోకుండ కొట్టే, ఎన్నికల ఫలితాలతో
నా బిడ్డ చూస్తెనేమో, పాపం ఇంకా, లోకం మాటలే నేరుస్తుండే
కేసులొచ్చి వెంటాడితే, దిక్కెవరు నాకు, సోనియా రాహూలా
ఇక్కడేమో జగన్, పక్కనేమో చంద్ర , పై నేమో నమో నరేంద్ర

3. చదువుకునే పిల్లల తండ్రి, కష్ట సంపాదనతో పైకి వస్తి
రంగనాయకుని నీడన ఎదిగె, నీతి లేని ధనము తో
ఊరూరా కాలేజీలు పెట్టి, విద్యనమ్మి అందినంత లాగేస్తిని
చంద్రన్న ఒడిలో సేదతీరుతు ఉంటే, ఎందిరా ఈ అనిల్ జగన్ దెబ్బ

4. పెద్దల సభలో, మిరపకాయ రసం తో, గడగడలాడిస్తి
రాష్ట్ర రాజకీయ, నగరం నుంచి, పిచ్చి పిచ్చి సర్వేలు
పక్క చంద్రన్న ఎన్నికలలో, అన్నీ లెక్కలు తప్పినా
కొత్త లెక్క లేసి చంద్రానికిస్తే, జగనేమో అధికార పీఠమెక్కే

5. అమ్మా సోనియమ్మా, ఇంకనేమి ఇవ్వాలి, ప్రత్యేక హోదా కన్నా
పసివాడిలా నమ్మకమైన, నన్నే ఓడించిరి, అమేధి లోని ప్రజలు
అక్క తో పక్కా ప్రచారం చేసినా, గెలుపు పై మనకు నమ్మకం రాదే
ప్రతి ఎన్నికలు ఇట్లుంటే, నేనెట్లా గెలవాలి, ఆ హస్తిన మోడీ ని

6. పెద్దన్నా ఎలా ఈదావు, ఆ ఎన్నికలు, ఈ అభిమానులతో
సినిమాలు వదలి, ప్రజలకోసం నేనెంతో, బిగ్గరగా అరచినా
కాలికి బలపం కట్టి, నడి ఎండలో, ఊరూరా తిరిగినా
సచివాలయంలో, ఒక్క టీ గ్లాస్ తో, మమ్ము సర్దుకోమంటిరే

7. అమెరికాను బాగు చేయమంటే, కాదని, అమరావతి కి వచ్చా
అన్ని పార్టీలకు ప్రమాదం, అని తెలిసినా, ఎన్నికలలో పోటీ చేసా
ఫాన్ కు లాభం, అని తెలిసి కూడా, హెలికాఫ్టర్ తో గిర గిర తిరిగా
ఇంత కష్టపడ్డా , నోటా ఓట్ల సంఖ్య , కూడా రాలేదాయే

8. ఏంది నాయనా, ఈ ఎంపీ, అరాచక ఫలితాలు
ఎన్నో బతుకమ్మలు పెట్టి, దేశ దేశాలు తిరిగినా
మా నాన్న మా అన్న, నా వెంటే ఉన్నారు అన్నా
తెలివైన రైతులేందే, నన్ను ఇట్ట ఓడించి, ఇంట్లోన బెట్టిరి

9. ఐరన్ లెగ్ అంటిరే తమ్ముళ్ళూ, తిక్క కుదిరిందా ఇప్పుడు
గోల్డెన్ లెగ్ అని నిరూపించా జబర్దస్తీ గా నేడు ఈ పార్టీలో
నగరికే మహరాజ్ఞి నైన నన్ను ఏ మంత్రి పదవి వరిస్తుందో
ఇకనైనా మాట అదుపులో ఉంచి, నాయకుడి పేరు నిలబెడతా

10. విశాఖ అన్నారు ముందు, మందలగిరికి నెట్టారు తరువాత
మా నాన్న ఒకవైపు, మామ ఒకవైపు ఉన్నారు లే అనుకుంటే
ప్రజలేమో ఇంకో పార్టీ వైపు పోయారేంది పానకాల స్వామీ
పక్క దారిన మంత్రినై తిరిగితినే, ఇప్పుడెలా ఏ పదవి లేక  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2108 General Articles and views 1,863,729; 104 తత్వాలు (Tatvaalu) and views 224,708
Dt : 24-May-2019, Upd Dt : 24-May-2019, Category : Politics
Views : 1542 ( + More Social Media views ), Id : 124 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Andhra Election , Pavan , Chandra Babu , Jagan , KA Pal , results
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content