APLatestNews.com top Banner
         
మనసున్న మంచి పాట - మత్తు వదలరా నిద్దుర మత్తు(శ్రీకృష్ణపాండవీయం) - లోకం తీరు
OurTripVideos - Visiting Places/Local Events Pictures and Videos. We visit, We record, We present, You Enjoy!
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. ఫ్రెండ్స్ తో షేర్ చేయగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
భీముడు కాపలా కర్తవ్యాన్ని మరచి కునుకు తీస్తూ ఉంటే, పెద్దాయన వేషంలో క్రిష్ణయ్య మెలుకొలుపుతూ కర్తవ్యాన్ని భోదిస్తారు. ఇది నేటికీ, ఏనాటికీ అయినా, అందరికీ కావాలసిన పాటే మంచి బోధనకు. అచ్చ తెలుగులో, సరళమైన పదాల భగవద్గీత , సామాన్యుల కొరకు. పెద్దల మాట చద్ది మూటలాగా, ఇది ఎంతో విలువైనది. అన్నగారి హావభావాలు నటన అపూర్వం, ఇంకొకరికి సాధ్యం కానే కాదు.

అపాయమ్ము దాటడానికుపాయమ్ము కావాలి
అంధకారమలమినపుడు వెలుతురుకై వెదకాలి
ముందు చూపు లేనివాడు ఎందునకు కొరగాడు
సోమరియై కునుకువాడు సూక్ష్మమ్ము గ్రహించలేడు


మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా - 2
ఆ మత్తులోన పడితే గమ్మత్తుగ చిత్తవుదువురా||మత్తు వదలరా||

జీవితమున సగ భాగం నిద్దురకే సరిపోవు - 2
మిగిలిన ఆ సగ భాగం చిత్తశుద్ధి లేకపోవు
అతినిద్రా లోలుడు తెలివి లేని మూర్ఖుడు - 2
పరమార్ధం గానలేక వ్యర్ధంగా చెడతాడు ||మత్తు వదలరా||

సాగినంత కాలం నా అంత వాడు లేడందురు
సాగక పోతే ఊరక చతికిలబడి పోదురు
కండ బలము తోటే ఘన కార్యము సాధించలేరు
బుద్ధి బలము తోడైతే విజయమ్ము వరింపగలరు
||మత్తు వదలరా||

చుట్టుముట్టు ఆపదలను మట్టుబెట్ట బూనుమురా - 2
పిరికితనము కట్టిబెట్టి, ధైర్యము చేపట్టుమురా
కర్తవ్యము నీ వంతు కాపాడుట నా వంతు - 2
చెప్పడమే నా ధర్మం వినక పోతే నీ ఖర్మం ||మత్తు వదలరా||

Lyrics: Mattu Vadalara - Sri Krishna Pandaveeyam, Ghantasala for NTR, Udaykumar, Writer Kosaraju Raghavaiah, 1966


Dt : 22-May-2019, Upd Dt : 22-May-2019 , Category : Songs, Views : 188 ( id : 118 )
Tags : Sri Krishna Pandaveeyam , Mattu Vadalara , ntr
గమనిక : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు.
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 7 yrs
No Ads or Spam, free Content