APLatestNews.com top Banner
         
మనసున్న మంచి మాటల పాట - ఆది భిక్షువు వాడినేది కోరేది(సిరివెన్నెల) - లోకం తీరు
OurTripVideos - Visiting Places/Local Events Pictures and Videos. We visit, We record, We present, You Enjoy!
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. ఫ్రెండ్స్ తో షేర్ చేయగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
శివయ్య చేసిన పనులు చమత్కారంగా చెపుతూ, ఆయనను ఏమి అడుగుతాము, ఏమి ఇస్తారు అని నర్మగర్భముగా వేదాంతాన్ని సరళ పదాలతో చెప్పారు. బాలు గొంతు మాధుర్యాని ఈ పాటలో కూడా ఆస్వాదించండి. పుణ్యం తో పాటు, మనశ్శాంతి కలిగిస్తుంది.

ఆది భిక్షువు వాడినేది కోరేది, బూడిదిచ్చేవాడినేది అడిగేది
ఏది కోరేది వాడినేది అడిగేది - 2 సార్లు

తీపి రాగాల ఆ కోకిలమ్మకు, నల్లరంగునలమినవాడినేది కోరేది
కరకు గర్జనల మేఘముల మేనికి, మెరుపు హంగుకూర్చినవాడినేది అడిగేది
ఏది కోరేది వాడినేది అడిగేది

తేనెలొలికే పూలబాలలకు, మూణ్ణాళ్ళ ఆయువిచ్చినవాడినేది కోరేది
బండరాళ్ళను చిరాయువుగ జీవించమని ఆనతిచ్చినవాడినేది అడిగేది
ఏది కోరేది వాడినేది అడిగేది

గిరిబాలతో తనకు కళ్యాణమొనరింప దరిజేరుమన్మధుని మసిచేసినాడు ...వాడినేది కోరేది
వరగర్వమున మూడు లోకాల పీడింప తలపోయుదనుజులను కరుణించినాడు... వాడినేది అడిగేది
ముఖప్రీతి కోరేటి ఉగ్గుశంకరుడు... వాడినేది కోరేది

ముక్కంటి ముక్కోపి... ముక్కంటి ముక్కోపి తిక్కశంకరుడు

ఆది భిక్షువు వాడినేది కోరేది, బూడిదిచ్చేవాడినేది అడిగేది
ఏది కోరేది వాడినేది అడిగేది

LYRICS - SIRIVENNELA, MOVIE - SIRIVENNELA, SINGER - SP BALU, 1986


Dt : 22-May-2019, Upd Dt : 22-May-2019 , Category : Songs, Views : 193 ( id : 117 )
Tags : sirivennela , Aadhi Bikshuvu
గమనిక : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు.
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 7 yrs
No Ads or Spam, free Content