APLatestNews.com top Banner
         
మనసున్న మంచి పాట - విధాత తలపున ప్రభవించినది(సిరివెన్నెల) - లోకం తీరు
OurTripVideos - Visiting Places/Local Events Pictures and Videos. We visit, We record, We present, You Enjoy!
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. ఫ్రెండ్స్ తో షేర్ చేయగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
సిరివెన్నెల శాస్త్రి గారి పద గుళికలకు, బాలు సరిగమల సుస్వరమాల, ఈ గీతం. సంగీత ప్రియులకు అమ్రుతం ఈ గీత గానం, ఆస్వాదించండి విశ్వనాధుని అభిరుచి. బెనర్జీ, సుహాసినీ ల అభినయం వర్ణనాతీతం. సామాన్య సంగీత రసికులకు, భావం అర్ధము కాకపోయినా, గాత్రం మరియు పదాలను ఆస్వాదించవచ్చు.

విధాత తలపున

విధాత తలపున ప్రభవించినది, అనాది జీవన వేదం - ఓం
ప్రాణ నాడులకు స్పందననొసగిన, ఆది ప్రణవ నాదం- ఓం
కనుల కొలనులో ప్రతిబింబించిన, విశ్వరూప విన్యాసం
ఎద కనుమలలో ప్రతిధ్వనించిన విరించి విపంచి గానం

సరసుస్వర సురఝరీ గమనమౌ సామవేద సారమిది, నే పాడిన జీవన గీతం ఈ గీతం
విరించినై విరచించితిని ఈ కవనం, విపంచినై వినిపించితిని ఈ గీతం

ప్రాగ్దిశ వీనియపైన దినకర మయూఖతంతృల పైన, జాగృత విహంగతతులే వినీల గగనపు వేదిక పైన
పలికిన కిలకిల స్వరముల స్వరజతి జగతికి శ్రీకారము కాగా, విశ్వకావ్యమునకది భాష్యముగ ||విరించినై||

జనించు ప్రతి శిశు గళమున పలికిన జీవన నాదతరంగం, చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగధ్వానం
అనాది రాగం ఆది తాళమున అనంత జీవన వాహినిగా, సాగిన సృష్టి విలాసమునే ||విరించినై||

నా ఉచ్చ్వాసం కవనం, నా నిశ్వాసం గానం
సరసుస్వర సురఝరీ గమనమౌ సామవేద సారమిది
నే పాడిన జీవన గీతం ఈ గీతం, విరించినై విరచించితిని ఈ కవనం
విపంచినై వినిపించితిని ఈ గీతం

LYRICS - SIRIVENNELA, MOVIE - SIRIVENNELA, SINGER - SP BALU, 1986


Dt : 20-May-2019, Upd Dt : 20-May-2019 , Category : Songs, Views : 177 ( id : 115 )
Tags : sirivennela , vidhata talapuna
గమనిక : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు.
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 7 yrs
No Ads or Spam, free Content