108 ప్రదక్షిణలు జీపీయస్, మంచి మాట, బయట తిండి, పెట్రోలు రేటు, బాపట్ల ఎమ్మెల్యే అభిమాని - Politics - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1001 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 నిమిష చదువు సమయం.

మన స్టేటస్ లో ఫోటోలు గురించి కొన్ని,

1* 108 ప్రదక్షిణలు జీపీయస్ రికార్డింగు చుట్టలు వృత్తాలు చూసారు కదా, ఒకే చోట షుమారు 2 మైళ్ళ నడక ఆగకుండా, గంట సేపు పాదాల బాధతో వేలి గీతల లెక్క తో, నారాయణ మంత్రాలు కెమెరా లు రక్షణ శుభ్రత మధ్యలో, కేవలం 3 బై 3 గది వైశాల్యం లో.

మన పెద్దలు ఎంత తెలివిగా ఆరోగ్య సూత్రాలు పెట్టారో. పెద్దలు పిల్లలు తిరగలేని వారు, అక్కడ నే కూర్చుని, తమ వారి భద్రత అవసరం చూడవచ్చు.

జిమ్ కి గ్రౌండ్ కి పోయిన వారు, మరలా వెనక్కు వస్తారో లేదో తెలీదు ఈరోజు ల్లో.

పెద్దలు మాట మరచి గేళిచేస్తూ, గుమ్మం కు పట్టనంత లావు బరువు ఎదిగి, రోగాలు తో బాధపడుతున్నాము.

2* వెంట రాని ఇంటి ని ఒంటిని రోజూ కడుగుతావు, మరి వెంట వచ్చే మనసు ఆత్మ (వాసనల) ను ఎప్పుడు కడుగుతావు? ఇది ఎవరం ఆలోచన చేయం.

3* అందం, ఆస్తి, పేరు, హోదా, వ్యక్తిత్వం, ఏది పెంచుకోవాలో ఏది ఉపయోగమో చూడండి.

4* తప్పు చేసిన వారిని కాలం శిక్షిస్తుంది, మనం ఏమీ చేయకున్నా, కృష్ణుని గీత చూడండి.

5* బయట తయారు చేసే తిండి పాకెట్లు చూడండి, తయారు చేసేటప్పుడు చెమట చుక్కలు, కాళ్ళు దుమ్ము తో తొక్కి, ఎలా చేస్తున్నారో. అందుకే బయట తిండి వద్దు, ఇంట్లో చేసుకోవడమే ఉత్తమం.

చైనాలో తయారైన ఐస్‌క్రీంలోనూ, కరోనా ఆనవాళ్లు కనిపించినట్లు తేలింది. తిన్నవారందరినీ క్వారంటైన్‌లో ఉండాలని అధికారులు సూచించారు.

ఇంట్లో తయారైన తిండి మాత్రమే, తినడం ఉత్తమం.

6* మా (మన) పెద్దబ్బాయి బీజేపీ అభిమానులు ఓ ఫోటో సోషల్ మీడియా లో తిప్పుతున్నారు పెట్రోలు రేటు గురించి. ఇది నిజమేనా అన్నది, రెండో అబ్బాయి తెదేపా, మూడో అబ్బాయి వైకాపా చెప్పాలి.

అసలు ధర 34. రాష్ట్రాలకు పంచే, కేంద్ర పన్ను షుమారు 16 ఉంటే, రాష్ట్రం పన్ను 31 ఎక్కువగా ఉంది, డీలర్ లాభం 6 రూ ఉంది. మొత్తము 88 అయ్యింది.

అంటే, తక్కువ పెట్రోలు రేటు ఉంటే, జనం జులాయి గా తిరిగి, రోడ్డు ప్రమాదం పెరుగుతుంది అని కావచ్చు ఏమో. కానీ కూరలు వస్తువుల రవాణా రేటూ తగ్గుతుంది కదా, రాష్ట్ర పన్ను తగ్గితే. అందుకే కొంతమంది జీఎస్టీ లో పెట్టమంటారు.

7* బాపట్ల ఎమ్మెల్యే అభిమాని ఒకరు, బాపట్ల జిల్లా కోసం పోరాడి, జిల్లా తెచ్చారు అని రాసారు. బాపట్ల, గుంటూరు, ఒంగోలు పార్లమెంటు స్ధాన జిల్లా కోసం, ఎవరూ పోరాటం చేయకుండా నే, ఆటోమేటిక్ గా జగనన్న జిల్లా ఇస్తారు. పోరాటం అంటే, మిగతా అసెంబ్లీ నాయకులు చేస్తున్నప్పడు మాత్రమే అనాలి కదూ.

మా చీరాల నాయకులు పోరాటం చేయరు, గట్టిగా మీడియా మరియు నాయకుల ముందు అడగరు. ఇంక పోరాటం ఆరాటం ఎక్కడ ఉంది వారిలో, కేవలం ఎమ్మెల్యే ఎమ్మెల్సీ పదవి వారసత్వ కాంక్ష తప్ప.

అలాగే మీ అసెంబ్లీ నియోజకవర్గ నాయకులు కూడా మిత్రమా. చిత్తశుద్ధితో కనీసం జిల్లా శాఖలు అయినా తేవాలి కదా.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1029 General Articles, 46 Tatvaalu
Dt : 17-Jan-2021, Upd Dt : 17-Jan-2021, Category : Politics
Views : 98 ( + More Social Media views ), Id : 927 , State : AP/ Telangana (Telugu) , Country : India
Tags : 108 pradakshina , rounds , gps , good words , no outside food , state , petrol , rate , tax , bapatla mla fan
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 8 yrs
No Ads or Spam, free Content