APLatestNews.com top Banner

Social Media links
గుడి చుట్టూ 108 ప్రదక్షిణలు, చలితో వణుకుతున్న కొడుకు, తల్లి ఎందుకు ఆపలేదు? - Devotional - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 930 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 నిమిష చదువు సమయం.

మన సొంత పిల్లలు ను లేదా జీవిత భాగస్వామి ని, గుడి చుట్టూ 108 ప్రదక్షిణలు తిరగనీయము కాళ్ళు కందుతాయి లేదా నొప్పి అని లేదా అంత సమయము వెచ్చించటానికి మనసు ఒప్పక.

మనసు అదుపులో పెడతానికి అదొక మార్గము అని తెలిసినా కూడా, చేయము. దేవునిదే భారము అంటాము నోటితో, కానీ చేతలలో లేదా మనసులో ఉండదు. మనము కష్టపడేది ఏమీ చేయము.

కష్టాలు వచ్చిన తర్వాత చూద్దాం లేదా లక్ష ఇచ్చి తేలికగా పూజ చేపిద్దాం భోజనాలు పెడదాము అనుకుంటాం కదా. దేవుడికి డబ్బు లేక మన డబ్బుకు లొంగుతాడు ఏమో నని ఆశపడతాము, ఆశపెడతాము.

మరి అంత కష్టం, ఖాళీ పాదాలతో చలితో వణుకుతున్న కొడుకు ను, ఈవారం మానేయి, వచ్చే వారం చేద్దాం లేదా 24 వారాలు చాలు అంటూ ఎందుకు 60 పైన వయస్సు ఉన్న అమ్మ ఆపడంలేదు?

కొడుకు కు ఇబ్బంది అయితే, ఆమె కే కదా నష్టం. అంటే కొడుకు మీద జాలి ప్రేమ కనికరం మానవత్వం లేదా ఇతర తల్లుల లాగా? దగ్గర ఉండి మరీ లెక్క వేస్తూ, కనీసం 24 వ వారం అయినా, గాప్ ఇద్దాం లేదా ఆపేయి అని అనడం లేదు, ఎందుకు?

మంచి పని అయితే, మిగతా తల్లి దండ్రులు ఎందుకు చేయరు? శని ఆది ఉదయం పది లోపు పని ఉండదు కదా? మాములుగా, కోరిక తీరాక కదా మొక్కు తీర్చేది , ముందే ఎందుకు?

జవాబు.

మనలో నూటికి 75 శాతము మంది, మోహము లో ఉంటాము. మోహము అంటే అధికారము, అహంకారము, డబ్బు, మదము, ఇంకా ఎన్నో వాటికి ముద్దు పేరు మోహము. ఆ మొహములో మనము లేదా మన పిల్లలు 108 ప్రదక్షిణలు కు ఎప్పుడో తిలోదకాలు ఇచ్చాము. కష్టము అనేది ఎవరికీ తెలియకూడదు మన ఇంట్లో, అంతా డబ్బుతో లేదా పని వాళ్ళతో కానిచేద్దాము.

అందుకే పిల్లలు, ఏదైనా ఇబ్బంది వస్తే, తట్టుకోలేక ఆత్మహత్యలు కు పోతున్నారు లేదా పెద్దల ఆస్తి తగలేస్తున్నారు లేదా పెడదోవలు పడుతున్నారు. పైకి పూజలు చేసినా, దేవుడితో పని లేదు కష్టపడాల్సినది ఏమి అక్కరలేదు, అంతా మేమే ఇస్తాము అని అనుకుంటున్నారు. అంటే నటిస్తారు లేదా మొక్కుబడి గా చేస్తారు, కానీ దేవుని మనసా వాచా కర్మాణా నమ్మరు.

క్రిష్ణయ్య ద్రోణ వాదనలు విన్నాము కదా భారతములో. అందులో ఏమి చెప్పారు, పిల్లలకు ఏమీ లేకపోయినా ఎలా బతకాలో నేర్పావా? కష్టము అంటే తెలియ చెప్పావా? సంస్కారము, క్రుతజ్ఞత నేర్పావా? అని విన్నాము కదా.

పది పాస్ అయితే తిరుపతి వస్తాము లేదా ప్రదిక్షణలు చేస్తాము అని మొక్కు కుంటాము. అంటే దేవునితోనే బేరము పెడతాము. అది మన సంస్కారము. ఇప్పుడు ఆ తల్లి, ఎందుకు గమ్ముగా ఉందో చూద్దాము.

మిగతా 25 శాతము మంది, దేవునితో బేరాలు ఆడరు, ఇది ఇస్తే అది చేస్తాము అనరు. తమకు డబ్బు ఉన్నాకూడా, తమ బిడ్డలకు ఎప్పుడూ దేవుడే అండ అని గట్టిగా నమ్ముతారు. అందుకే, తప్పనిసరిగా చిన్నప్పటినుండి దైవ భక్తి, బాధ్యత, కష్టము నేర్పిస్తారు. తిరుపతి కొండ ఎక్కిస్తారు, గుడి చుట్టూ తిప్పుతారు.

మేము ఉన్నా లేకపోయినా, అసలు రక్షకుడు దేవుడు మాత్రమే అని వారి విశ్వాసము. అందుకే, కోరిక కోరకుండానే, వీలు అయిననన్ని పూజలు, రామకోటి లేదా ప్రదక్షిణలు తిరగాలి. అవి దేవుడి దగ్గర జమ అవ్వాలి, దేవుడే మనకు బాకీ ఉండాలి ఎప్పుడూ
అని వారు విశ్వసిస్తారు. అందుకే చలి అయినా వర్షము అయినా గొడుగుతో అయినా, నియమము ప్రకారము తిరగాలిసిందే, ఆగకూడదు మారీ ప్రాణాపాయము వస్తే తప్ప.

ఎప్పుడూ కూడా, దేవునికి మనము లక్షమంది కన్నా, విడిగా కష్టజీవిగా గొప్పగా కనపడాలి. అప్పుడే ఆయన అండ క్రుప లభిస్తుంది.

భక్త కన్నప్ప, తన కళ్ళు తీసి దేవునికి ఇచ్చాడు. మనము అంత పని చేయలేము కదా.

కనీసము 20 ఏళ్ళు నేల నిద్ర, 20 ఏళ్ళ శాఖాహారము, అష్ట వ్యసనాలకు దూరముగా ఉండటము, యోగా, ధ్యానము, పూజ, తల్లి దండ్రులను చూడటము, 24 వారాల 108 ప్రదక్షిణలు, దేని మీద మోహము లేకుండుట, దేవుని చేరుటకు ఎప్పుడైన సిద్దము అనుట, ఇంకా ఇలా ఎన్నో ఉంటే కూడా మనల్ని దేవుడు గుర్తిస్తారో లేదో తెలీదు.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 958 General Articles, 46 Tatvaalu
Dt : 06-Dec-2019, Upd Dt : 06-Dec-2019, Category : Devotional
Views : 328 ( + More Social Media views ), Id : 244 , State : AP/ Telangana (Telugu) , Country : India
Tags : pradikshana
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 8 yrs
No Ads or Spam, free Content