APLatestNews.com top Banner

Social Media links
10 ఏళ్ళ కే, ఇది చేయగలిగితే నేర్పగలిగితే, సాత్విక గుణం తేలికగా అలవాటు పడుతుంది - Devotional - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 నిమిష చదువు సమయం.

మనం పూజ చేసేటప్పుడు, ఎదురు గా భగవంతుడు, నిజంగా ఉన్నారు అనుకుని, కనీసం రామా రామా అనే మాటలు అనేటప్పుడు లేదా స్తోత్రాలు చదివేటప్పుడు, గొంతు బొంగురు పోయి, కన్నీళ్ళు కారడం మొదలు పెడితే, మనము నిజమైన చిత్తశుద్ధితో పూజ చేసినట్లు.

నైవేద్యం గా బెల్లం చాలు, పూజకు ఆకులు చాలు, పూలు లేకపోయినా. అవీ లేకపోతే, గుక్కెడు నీళ్ళు చాలు. బాహ్య ఆర్భాటాలు కాదు, లోన అంతరంగం ముఖ్యం. పేద, ధనిక తేడా ఉండకూడదు పూజలో.

కానీ రెండో మెట్టు, కనీసం అరగంట కళ్ళు మూసుకొని కూర్చోగలిగితే ధ్యానం లో. ఇది జరగనిదే, దేవుని మహిమ చూడలేము.

10 ఏళ్ళ వయస్సు కే ఇది చేయగలిగితే నేర్పగలిగితే, సాత్విక గుణం తేలికగా అలవాటు పడుతుంది. పిల్లల కు ఇవి నేర్పిన, బయట జరిగే ఘోరాలు, అకాల మరణాలు, ఎడబాటు ఉండదు, వృద్ధ ఆశ్రమాల అవసరం రాదు. అరిషడ్ వర్గాలను జయిస్తారు తేలికగా.

కానీ ఆ తీరిక ఓపిక, నేటి తల్లి దండ్రులు కు లేదు, సంపాదన ప్రాపంచిక మోహం తప్ప. పిల్లల చేతిలో, టీవీ రిమోట్, కంప్యూటర్ లాప్ టాప్ లేదా ఫోన్ పెట్టి, తల నొప్పి భారం తగ్గించుకుంటున్నారు. లేదంటే ఆయా, బయట చూసే వారు లేదా అమ్మమ్మ నాయనమ్మ దగ్గర, వదలడం.

చిత్తశుద్ధి పూజ లేదంటే, మొక్కుబడి పూజే ప్రసాదానికి, తూతూమంత్రంగా. నూటికి, 60 మంది ఇలాగే ఉంటారు. ఎందుకు ఏమి చేస్తున్నారో వాళ్ళకు అనవసరం, తెలీదు కూడా. వాళ్ళ వాదన ఇలా ఉంటుంది, చూడండి.

ఒకరు, నాకు తెలిసి ప్రపంచం అంతా, ఓకే సారి నిద్ర పోయి ఒకేసారి లెగుస్తారు అంటారు, వాదిస్తారు, ఎన్నడూ జిల్లా దాటని ఆయన. ఇది సత్యం, నా 70 ఏళ్ల జీవిత అనుభవ సారం లో అంటారు. ఇంకొకరు చెప్పిన కూడా వినరు. ఆయన చూడనంత మాత్రాన, విననంత మాత్రాన, అది వాస్తవమా? ఇక మారతారా?

వాస్తవం ఏమిటి అంటే, తూర్పు జపాన్ నుంచి పశ్చిమ అమెరికా వరకు, ప్రతి గంటా రెండు గంటలకు, ఓ దేశం ఓ రాష్ట్రం, నిద్ర లోకి వెళుతుంది, ఇంకో దేశం రాష్ట్రం నిద్ర లో నుంచి లెగుస్తుంది. ఆయన నమ్ముతారా, ఈ మాట ఈ జీవితంలో?

మన పూజ పునస్కారాలు అంతే, వందల జన్మ ల తర్వాత, సాత్విక గుణం అబ్బి, దానిని కూడా దాటే ప్రయత్నం చేస్తారు, సర్వేశ్వరుని చేరడానికి.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 855 General Articles, 46 Tatvaalu
Dt : 12-Nov-2020, Upd Dt : 12-Nov-2020, Category : Devotional
Views : 63 ( + More Social Media views ), Id : 812 , State : AP/ Telangana (Telugu) , Country : India
Tags : 10 year old kid , taught , satvic quality , accustomed , god , puja , dhyanam
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 8 yrs
No Ads or Spam, free Content